ట్విట్టర్ కు బై చెబుతున్నారు.. దూసుకుపోతున్న కూ..!

కూ యాప్ దూసుకుపోతోంది. ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ‘కూ’ దూసుకుపోతోంది. గత కొన్ని నెలలుగా భారత్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ చేపడుతున్న చర్యలు ఎన్నో వివాదాస్పదమైంది. దీంతో ‘కూ’ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. 10 మిలియన్ల మంది వినియోగదారులను ‘కూ’ అధిగమించింది. 16 నెలల వయస్సు గల ‘కూ’ యాప్.. యూజర్లకు ఇంగ్లీష్ మరియు హిందీ మరియు కన్నడ వంటి ఏడు భారతీయ భాషలలో పోస్ట్‌లను చేయడానికి వీలు కల్పిస్తుంది. మోదీ ప్రభుత్వంతో ట్విట్టర్ వివాదాలు పెరిగినప్పటి నుండి ‘కూ’ వినియోగదారులు దాదాపు 85% మంది చేరారు. ప్రభుత్వ మంత్రులు, ప్రతిపక్ష రాజకీయ నాయకులు, క్రికెట్ తారలు, బాలీవుడ్ ప్రముఖులు కూ నుండి భారతీయ భాషలలో పోస్ట్ చేయడం ప్రారంభించారు.
2020 నాటికి కూ యాప్ ను 2.6 మిలియన్ల మంది ఇన్ స్టాల్ చేసుకున్నారు. ట్విట్టర్ భారత్ నిబంధనల్ని ఉల్లంఘిస్తుందంటూ పలువురు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులపై కేంద్రం ట్విట్టర్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సర్టిఫైడ్ బ్లూ టిక్ ను తొలగించడం, కేంద్రం తెచ్చిన ఐటీ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ ట్విట్టర్ ప్రవర్తించడంతో కేంద్ర కేబినెట్ మినిస్టర్లతో ‘కూ’ కు అలవాటు పడ్డారు.
హిందీ, ఇంగ్లీష్‌తో పాటు ఇతర స్థానిక భాషల్లో ఆపరేట్ చేసేలా అందుబాటులోకి రావడం ‘కూ’ కు ప్లస్ అయ్యింది. కూ కో ఫౌండర్ అప్రమేయ రాధాకృష్ణ మాట్లాడుతూ స్థానిక భాషాల్లో దేశీ యాప్‌ను వినియోగించేలా డెవలప్ చేశామన్నారు. త్వరలోనే సౌత్ ఈస్ట్ ఏసియన్ కంట్రీస్, ఈస్ట్రన్ యూరప్, సౌత్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. “ప్రభుత్వంతో ట్విట్టర్ ఉద్రిక్తత కారణంగా మేము వెలుగులోకి వచ్చాము, కానీ వినియోగదారులు తమ మనసులోని మాటను మాతృభాషలో కూలో మాత్రమే చెప్పగలరని గ్రహించారు” అని అప్రమేయ రాధాకృష్ణ అన్నారు.