More

    కోనసీమలో అర్ధరాత్రి కాల్పుల కలకలం

    కోనసీమ జిల్లాలో అర్ధరాత్రి సమయంలో కాల్పుల కలకలం నెలకొంది. రావులపాలెంలో అర్ధరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఫైనాన్స్ వ్యాపారి అయిన సత్యనారాయణరెడ్డిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. మొదట సత్య నారాయణ రెడ్డిపై దాడిచేయగా కుమారుడు ఆదిత్యరెడ్డి వారిని ప్రతిఘటించడంతో నిందితులు గాల్లోకి కాల్పులు జరిపారు. సత్యనారాయణ, ఆయన కుమారుడు కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. పారిపోతున్న సమయంలో ఓ దుండగుడి దగ్గరున్న చేతి సంచి కిందపడింది. దానిని పరిశీలించగా అందులో రెండు నాటుబాంబులు, జామర్ ఉన్నాయి. కాల్పులకు చుట్టుపక్కల వాళ్లు రావడంతో నాటుబాంబులు ఉన్న బ్యాగ్ అక్కడే వదిలేసి పారిపోయారు దుండగులు.
    సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    spot_img

    Trending Stories

    Related Stories