More

    భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలి: రాజగోపాల్‎రెడ్డి

    తెలంగాణలో 18లక్షల ఎకరాల భూములు కాజేయాలని కేసీఆర్ కుటుంబం కుట్ర చేసిందని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‎రెడ్డి ఆరోపించారు. సామాన్యుల నుంచి భూములు లాక్కోవాలని పథకం ప్రకారమే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారని విమర్శించారు. మునుగోడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ధరణి ద్వారా రాష్ట్రంలోని దాదాపు 18లక్షల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కేసీఆర్ చేతుల్లోకి వెళ్తున్నాయన్నారు. రూ.18లక్షల కోట్లతో దేశంతో అతిపెద్ద కుంభకోణం చేశారని ఆరోపించారు. దేశంతో ఇప్పటి వరకు ఇలాంటి స్కాం ఎక్కడా జరగలేదని, భూముల కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ధరణి పోర్టల్ అవినీతిపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం అని రాజగోపాల్‎రెడ్డి తెలిపారు.

    Trending Stories

    Related Stories