మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. ప్రజలంతా తనకు మద్దతుగా ఉన్నారని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే తన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ తనకు కాంట్రాక్టులు ఇచ్చినట్లు నిరూపిస్తే దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ని జైలుకు పంపే వరకు నిద్రపోనని అన్నారు. అభివృద్ధి అంటే సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటేనా..? అని ఆయన ప్రశ్నించారు. సీపీఎం, సీపీఐ నాయకులు కేసీఆర్తో ప్యాకేజీ మాట్లాడుకున్నారని, అయితే కార్యకర్తలు మాత్రం తనకే మద్దతుగా ఉన్నారని స్పష్టం చేశారు.