Telugu States

స్రవంతి నాయుడు తల్లిని ఆదుకోడానికి ముందుకొచ్చిన కోహ్లీ

తన భార్య అనుష్క శెట్టితో కలిసి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో మంచి పనులు చేస్తూ ఉన్నారు. కరోనా కష్ట కాలాల్లో పలువురికి అండగా నిలుస్తూ ఉన్నాడు విరాట్. తాజాగా స్రవంతి నాయుడు తల్లి కోసం 6.77 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించాడు కోహ్లీ. ఇంతకూ ఈ స్రవంతి నాయుడు ఎవరు అనే కదా.. ఆమె భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. హైదరాబాద్ ప్లేయర్ అయిన స్రవంతి నాయుడు టీమిండియా తరపున 1 టెస్టు, 4 వన్డేలు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడింది.

స్రవంతి నాయుడు తల్లి కరోనా ఎస్‌కే సుమన్‌ ఇటీవలే కరోనా బారీన పడ్డారు. ఆమెను ఆసుపత్రిలో జాయిన్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. తన తల్లి చికిత్సకు సంబంధించి సాయం చేయాలంటూ స్రవంతి బీసీసీఐతో పాటు హెచ్‌సీఏ, ఇతర క్రీడా సంస్థలకు కోరింది. తమ పరిస్థితిని స్రవంతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. బీసీసీఐ మాజీ సౌత్‌జోన్‌ కన్వీనర్‌ ఎన్‌ విజయా యాదవ్‌ స్రవంతి పోస్టును షేర్‌ చేస్తూ విరాట్ కోహ్లీకి ట్యాగ్‌ చేసింది. స్రవంతి తల్లికి కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ పేరిట ఇప్పటికే రూ. 16 లక్షలు ఖర్చు అయిందని వివరించింది. ఆమెను ఆదుకోవాలని కోరింది. విజయా యాదవ్‌ పోస్టుకు స్పందించిన కోహ్లి స్రవంతి తల్లికి సాయంగా రూ. 6.77 లక్షలు సాయంగా అందిస్తున్నట్లు తెలిపాడు. హెచ్‌సీఏ (హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) కూడా స్రవంతి అభ్యర్థన మేరకు ఆమె తల్లి చికిత్సకు రూ. 5 లక్షలు సాయం అందించింది.

కరోనాపై పోరులో భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ తమ వంతుగా ఇద్దరి తరఫున రూ. 2 కోట్లు విరాళం ఇచ్చారు. ఇదే కాకుండా పలువురికి కోహ్లీ తనవంతుగా సాయం చేస్తూ ఉన్నాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − seven =

Back to top button