తాడేపల్లికి వచ్చిన కోడి కత్తి శీను కుటుంబం

0
973

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 2019 ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి చేసిన జనిపల్లి శ్రీనివాసరావు అలియాస్ శీను కుటుంబం తాడేపల్లికి వచ్చింది. సీఎం జగన్ ను కలిసేందుకు శీను తల్లిసావిత్రి, సోదరుడు సుబ్బరాజులు బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ కేసులో విచారణ ఖైదీగా శీను నాలుగేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడని.. తన కుమారుడికి బెయిల్ ఇచ్చి ఆదుకోవాలని సీఎం జగన్ ను కోరేందుకు వారు తాడేపల్లి వచ్చారు. శీనుకు న్యాయవాదిగా వ్యవహరిస్తున్న అలీతో కలిసి వారు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తాడేపల్లి వచ్చిన తాము సీఎంను కలవలేదని సావిత్రి తెలిపారు. తన కుమారుడు శీనుకు బెయిల్ ఇప్పించుకునేందుకే తాము న్యాయవాదితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చామని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న స్పందన కార్యాక్రమంలో వినతి పత్రం సమర్పించామన్నారు. తమ అబ్బాయి జగన్ పై దాడి చేశాడో, లేదో తనకు తెలియదని సావిత్రి అన్నారు. బెయిల్ ఇచ్చి తన కుమారుడిని విడిపించాలని జగన్ ను కోరుతున్నానన్నారు.