ఫేస్‌బుక్ పేరెంట్ సంస్థ మెటా ప్లాట్‌ఫారమ్‌లు గురువారం సంధ్యా దేవనాథన్‌ను ఇండియా హెడ్, వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఇండియా హెడ్‌గా మాత్రమే కాకుండా మెటా వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇటీవలే మెటా నుంచి అజిత్ మోహన్ వెళ్లిపోయారు. వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్, మెటా ఫ్లాట్‌ఫామ్ పబ్లిక్ పాలసీ డైరక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా ఇటీవల రిజైన్ చేశారు. 2016 నుంచి సంధ్యా దేవనాథన్ మెటాలో పనిచేస్తున్నారు. జనవరిలో ఆమె కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు. ఫేస్‌బుక్‌పై ప్రస్తుతం ఇండియాలో రెగ్యులేటరీ సమస్యలు ఉండడం.. కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తున్న తరుణంలో సంధ్యా దేవనాథన్ నియామకం కీలకంగా భావిస్తూ ఉన్నారు.
సంధ్యా దేవనాథన్ 22 సంవత్సరాల అనుభవం ఉందని.. బ్యాంకింగ్, చెల్లింపులు, సాంకేతికతలో మంచి పట్టు ఉందని ఆమె తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీలో MBA పూర్తి చేశారు. ఆమె 2016లో మెటాలో చేరారు. సింగపూర్, వియత్నాం విభాగాలకు సంబంధించి కీలకంగా పని చేశారు.