More

    లార్డ్స్ టెస్ట్ లో రాహుల్ సెంచరీ.. మొదటి రోజు మనదే..!

    లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో భారత బ్యాట్స్మెన్ రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ శర్మ సెంచరీ మిస్ చేసుకోగా.. కేఎల్ రాహుల్ సెంచరీతో కదంతొక్కాడు. రోహిత్‌శర్మ, కేఎల్ తొలి వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 1952 తర్వాత లార్డ్స్ లో భారత ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం సాధించడం ఇదే మొదటిది. వినూ మన్కడ్-పంకజ్ రాయ్ ఈ ఘనత సాధించారు. టెస్టుల్లో రోహిత్-రాహుల్ తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించడం ఇది రెండోసారి.

    బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై భారత ఓపెనర్లు సహనాన్ని చూపించారు. ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళుతున్న బంతులను భారత ఓపెనర్లు దాదాపుగా విడిచిపెడుతూ వచ్చారు. 15 ఓవర్ల వరకూ భారత ఆటగాళ్లు ఎటువంటి షాట్స్ ఆడలేదు. ఆ తర్వాత శామ్ కరణ్ వేసిన ఒకే ఓవర్లో రోహిత్ శర్మ నాలుగు ఫోర్లు కొట్టాడు. ఓవర్సీస్ సెంచరీ లేని రోహిత్ శర్మ లార్డ్స్ లో ఆ రికార్డును అందుకుంటాడని అభిమానులు భావించారు. అయితే 145 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 83 పరుగులు చేసిన రోహిత్ జేమ్స్ అండర్సన్ బౌలింగులో బౌల్డయ్యాడు. మరోవైపు కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చతేశ్వర్ పుజారా మరోసారి విఫలమయ్యాడు. ఇక కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్ లో మంచి టచ్ లో కనిపించాడు. రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి వంద బంతుల్లో 18 పరుగులు మాత్రమే చేసిన రాహుల్ ఆ తర్వాత 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం మరో 75 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. కెప్టెన్ కోహ్లీ 42 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగులో వెనుదిరిగాడు. భారత్ నైట్ వాచ్ మెన్ ను పంపించకుండా.. రహానేను పంపించింది. మరో వికెట్ పడకుండా భారత జట్టు జాగ్రత్త పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. రాహుల్ (127), రహానే (1) క్రీజులో ఉన్నారు.

    Trending Stories

    Related Stories