Sports

ఫైనల్ కు చేరిన కోల్ కతా నైట్ రైడర్స్.. ఈ ఏడాది కొత్త ఛాంపియన్ లేనట్లే

ఈ ఏడాది మొదటి హాఫ్ ఐపీఎల్ లో 7 మ్యాచ్ లలో 2 మ్యాచ్ లు మాత్రమే గెలిచిన కోల్ కతా నైట్ రైడర్స్.. రెండో హాఫ్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేసింది. 7 మ్యాచ్ లలో 5 మ్యాచ్ లు గెలిచి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇక ఎలిమినేటర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చిత్తు చిత్తు చేసిన కోల్ కతా.. క్వాలిఫయర్-2 లో ఢిల్లీకి షాకిచ్చింది. ఇక ఫైనల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. కోల్ కతా నైట్ రైడర్స్ కు ఐపీఎల్ ఫైనల్ లో 100 శాతం విజయం రికార్డు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 9వ సారి ఐపీఎల్ ఫైనల్ ఆడనుంది.

ఐపీఎల్ క్వాలిఫయర్-2లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు మాత్రమే చేసింది. పిచ్ సహకరించకపోవడంతో బ్యాటర్లు పరుగులు చేయలేకపోరు. శిఖర్ ధవన్ (36), శ్రేయాస్ అయ్యర్ (30) మినహా జట్టులోని మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, లాకీ ఫెర్గుసన్ 1, శివం మావి 1 వికెట్ తీశారు. పృథ్వీ షా 18, మార్కస్ స్టొయినిస్ 18 పరుగులు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. 136 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు శుబ్‌మాన్‌ గిల్, వెంకటేష్ అయ్యర్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 12 ఓవర్లలో జట్టు స్కోరు 96 పరుగులు వద్ద వెంకటేష్ అయ్యర్ కగిసో రబాడా బౌలింగ్‌లో వెనుతిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన నితీష్ రానా 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అన్రిచ్ బౌలింగ్‌‍లో షిమ్రోన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టారు. ఆ వెంటనే శుబ్‌మాన్‌ గిల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శుబ్‌మాన్‌ గిల్, అవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కేకేఆర్ ను ఢిల్లీ బౌలర్లు బాగా ఇబ్బంది పెట్టారు. దినేష్ కార్తీక్, మోర్గాన్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్ వంటి స్టార్లు వరుసగా డకౌట్ అయి వెనుదిరిగారు. అయితే రాహుల్ త్రిపాఠి ఇంకొక బంతి మిగిలి ఉండగానే సిక్సర్ బాది కేకేఆర్ ను ఫైనల్ కు చేర్చాడు. ఆఖరి ఓవర్ లో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ వేసినా రాహుల్ త్రిపాఠి సిక్సర్ కేకేఆర్ శిబిరంలో ఆనందాన్ని నింపింది.

Related Articles

Back to top button