కాకినాడ: గ్రామాలు కూడా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికీ గోదారోళ్ల గ్రామీణ పండుగలు చూసి తీరాల్సిందే. ఇలాంటి నేపథ్యంలోనే బుధవారం అట్లతదియని పురస్కరించుకుని భారీ ఎత్తున మహిళలు నోము నోచుకున్నారు. కాకినాడ జిల్లా కడియం మండలంలో అట్లతద్ది వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్న మహిళలు సాయంత్రం వేళ కాలువల్లో వద్దకు వెళ్ళి గౌరీదేవి పూజలు నిర్వహించారు. అట్లను వాయనాలు ఇచ్చుకున్నారు. కడియం, కడియపులంక, పొట్టిలంక, వేమగిరి, జేగురుపాడు మెయిన్ కాలువలు వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. అన్ని గ్రామాలలో అట్లతదియ వేడుకలు సందడిగా జరిగాయి.