పెదాలపై ముద్దు పెట్టుకుంటే..!

0
690

పెదాలపై ముద్దుపెట్టడం అసహజ లైంగిక నేరాల పరిధిలోకి రాదని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. శరీరాన్ని స్పృశించడం పెదాలపై ముద్దాడటం వంటివి ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం లైంగిక దాడి కిందకు రావని అభిప్రాయపడింది. ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది.

14 ఏళ్ల తన కుమారుడిపై లైంగిక దాడి చేశాడని ఓ వ్యక్తి గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోని కప్‌బోర్డులో ఉంచిన డబ్బులు సైతం పోయాయని తెలిపాడు. డబ్బులను నిందితుడికే ఇచ్చానని బాలుడు తన తండ్రితో చెప్పాడు. బాలుడు ‘ఓలా పార్టీ’ అనే ఆన్లైన్ గేమ్ అడుతుండేవాడు. ఈ గేమ్‌లో అప్గ్రేడ్ల కోసం రీఛార్జ్ చేయించుకునేందుకు నిందితుడి దుకాణానికి బాలుడు తరచూ వెళ్లేవాడు. ఓరోజు ఇలాగే రీఛార్జ్ కోసం వెళ్లగా.. నిందితుడు బాలుడి పెదాలపై ముద్దు పెట్టాడు.

ప్రైవేటు పార్ట్స్‌ను తాకాడు. దీంతో బాలుడి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో సహా పలు సెక్షన్ల కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 377ను సైతం ఎఫ్ఐఆర్లో జోడించారు. ఈ సెక్షన్ నిరూపితమైతే నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించవచ్చు. బెయిల్ లభించడం కూడా కష్టమే.

ఈ కేసు విచారణ జరిపిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్.. నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో లైంగిక దాడి జరిగినట్లు తేలలేదన్న విషయాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. అసహజ శృంగారం అన్న విషయం ఈ కేసుకు వర్తించదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘బాధితుడి స్టేట్మెంట్ ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం నిందితుడు బాలుడి ప్రైవేటు భాగాలను తాకాడు పెదాలపై ముద్దుపెట్టాడని.. తన దృష్టిలో ఇది సెక్షన్ 377 కింద నేరం కిందకు రాదని తీర్పునిచ్చారు. అదేకాకుండా.. నిందితుడు ఏడాదిగా కస్టడీలో ఉన్నాడని… విచారణ కూడా ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదని అభిప్రాయపడ్డారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here