More

    బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి: కిషన్‎రెడ్డి

    కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‎రెడ్డి నెల్లూరులో పర్యటించారు. మొదట రాష్ట్ర శాసనమండలికి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశంలో ప్రసంగించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాల వల్ల అట్టడుగు వర్గాల వారికి కలిగే ప్రయోజనాలేమిటో ప్రజలకు తెలియజేయాలని పాత్రికేయులను కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ బడుగు,బలహీన వర్గాల అభివృద్దే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలనూ తీసుకొచ్చారని, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు విశదీకరించాలని పాత్రికేయులను కోరారు. జర్నలిస్టులది సమాజంలో బాధ్యతాయుతమైన పాత్ర అని దాన్ని చక్కగా నిర్వర్తించాలని కోరారు.

    Trending Stories

    Related Stories