సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోస్టల్ కవర్ ఆవిష్కరణ

0
791

హైదరాబాద్: సర్దార్ సర్వాయి పాపన్న‎గౌడ్ పోస్టల్ కవర్‎ని చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో కేంద్రమంత్రి కిషన్‎రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‎రెడ్డి… పాపన్నగౌడ్ లాంటి మహనీయులను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ గడ్డ పౌరుషానికి ప్రతీక సర్దార్ పాపన్న‎గౌడ్ అని కొనియాడారు. భూస్వాములు, నియంతృత్వానికి వ్యతిరేకంగా బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసిన మహాయోధుడు పాపన్నగౌడ్ అని గుర్తు చేశారు. సర్దార్ పాపన్నగౌడ్ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్, తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

16 − six =