సీఎం కేసీఆర్ సర్కార్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన..కేసీఆర్ వైఖరి వల్లే తెలంగాణకు ప్రజలకు నష్టం జరుగుతోందన్నారు.MMTS రెండో దశకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, ట్రైబల్ మ్యూజియం, సైన్స్ సిటీకి ఇంతవరకు భూమి కేటాయించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమర్యాదగా ప్రవర్తిస్తోందన్న ఆయన…ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.మహిళ అని చూడకుండా గవర్నర్‌ను అవమానిస్తున్నారన్న కిషన్‌రెడ్డి…రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందన్నారు.కేసీఆర్‌కి రాష్ట్ర అభివృద్ధి పట్టదన్నారు. కేసీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కాదు… నిజాం రాజ్యాంగం కావాలంటున్నారు. తెలంగాణకు మోదీ మళ్లీ మళ్లీ వస్తారన్న కిషన్‌రెడ్డి… వెయ్యి మంది కేసీఆర్‌లు వచ్చినా మమ్మల్ని అడ్డుకోలేరని వార్నింగ్ ఇచ్చారు.