ఏలూరులో పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ నినాదంతో కొరమాండల్ గ్రోమోర్ ఎరువుల కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యే ఆళ్ల నాని, బీజేపీ నేతలు అంబికా కృష్ణ, విష్ణువర్ధన్‌రెడ్డి, భూపతిరాజు శ్రీనివాస వర్మ, నాకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.