కిషన్ రెడ్డి తలకు గాయం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గురువారం నాడు గాయమైంది. ఆశీర్వాద సభ ముగించుకొని దుర్గగుడికి వెళ్లే సమయంలో కారు డోర్ ఆయన తలకు తగిలింద. దీంతో ఆయన తలకు గాయమైంది. ఆశీర్వద సభ ముగించుకొని దుర్గ గుడికి వెళ్లేందుకు కారు ఎక్కుతుండగా కిషన్ తలకు బలంగా తగిలింది కారు డోర్.
ఉదయం ఆయన తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. అక్కడి నుండి నేరుగా ఆయన విజయవాడకు వచ్చారు. విజయవాడలో ఆయన బీజేపీ నిర్వహించిన ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఈ సభ ముగిసిన తర్వాత కిషన్ రెడ్డి విజయవాడలో ఇంద్రకీలాద్రి ఆలయంలో దుర్గమ్మను దర్శించుకొనేందుకు వెళ్లేందుకు ఆయన కారు ఎక్కుతున్న క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి. మంత్రి కారులో కూర్చొనే సమయంలో కారు డోర్ ఆయన తలకు బలంగా తగిలింది. గాయం అయినప్పటికీ కూడా ఆయన తన యాత్రను కొనసాగించారు.

అంతకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి విజయవాడకు ఆయన ర్యాలీగా బయల్దేరారు. అయితే ఎనికేపాడు వద్ద ఆయన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవని పోలీసులు చెప్పడంతో బీజేపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు కేవలం రెండు కార్లను మాత్రమే విజయవాడ వైపుకు అనుమతించారు. ఇతర కార్లు, బైకులన్నీ అక్కడే ఆగిపోయాయి. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారని ఏపీ బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. విజయవాడ చేరుకున్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం బీజేపీ శ్రేణులను వేధిస్తోందని ఆరోపించారు.