కేంద్ర కేబినెట్ మంత్రిగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు జి. కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో ఆయన కేంద్ర హోంశాఖా సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతిని కల్పించారు. కిషన్ రెడ్డి భారతీయ జనతాపార్టీలో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నారు. యువమోర్చాలో కీలక పదవులు చేపట్టారు. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా గెలిచారు. మోడీ 2.0 మంత్రివర్గంలో సహాయమంత్రిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ప్రమోషన్ దక్కింది. తెలంగాణ నుంచి మొట్ట మొదటి కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి చరిత్ర సృష్టించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు డాక్టర్లు చేరారు. బుధవారం జరిగిన మెగా మంత్రివర్గ విస్తరణలో 36 మందికి కొత్తగా మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో కొత్తగా చేరిన వారిలో నలుగురు డాక్టర్లు ఉన్నారు. మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన ఎంపీ డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, మహారాష్ట్ర ఔరంగాబాద్‌కు చెందిన పిల్లల డాక్టర్ భగవత్ కరాద్, పశ్చిమ బెంగాల్ బంకురా ఎంపీ, గైనకాలజిస్ట్ డాక్టర్ సుభాస్ సర్కార్, గుజరాత్ సురేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ మహేంద్ర ముంజపారా బుధవారం కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తగా నలుగురు డాక్టర్లు కేబినెట్లో చేరడంతో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న డాక్టర్లైన మంత్రుల సంఖ్య ఆరుకు చేరింది.
భారతప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్, కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్, విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దేవశ్రీ చౌదరి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రి సంజయ్ ధోత్రే, కేంద్ర అటవీశాఖ మంత్రి బాబుల్ సుప్రియోలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
మంత్రులుగా ప్రమాణం చేసిన వారి జాబితా
- నారాయణ రాణే
- సర్బానంద సోనోవాల్
- డా. వీరేంద్ర కుమార్
- జ్యోతిరాదిత్య ఓం సింధియా
- రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్
- అశ్విని వైష్ణవ్
- పశుపతి పరాస్
- కిరెన్ రిజిజు
- రాజ్ కుమార్ సింగ్
- హర్దీప్ సింగ్ పూరి
- మన్సుఖ్ మాండవియా
- భూపేందర్ యాదవ్
- పార్షోత్తం రూపాల
- జి. కిషన్ రెడ్డి
- అనురాగ్ సింగ్ ఠాకూర్
- పంకజ్ చౌదరి
- అనుప్రియా సింగ్ పటేల్
- డి. సత్య పాల్ సింగ్ బాగెల్
- రాజీవ్ చంద్రశేఖర్
- శోభా కరండ్లజే
- భాను ప్రతాప్ సింగ్ వర్మ
- దర్శనా విక్రమ్ జర్దోష్
- మీనాక్షి లేకి
- అన్నపూర్ణ దేవి
- ఎ. నారాయణస్వామి
- కౌషల్ కిషోర్
- అజయ్ భట్
- బి. ఎల్. వర్మ
- అజయ్ కుమార్
- చౌహన్ దేవుసిన్హ్
- భగవంత్ ఖుబా
- కపిల్ మోరేశ్వర్ పాటిల్
- ప్రతిమా బౌమిక్
- డా. సుభాస్ సర్కార్
- డా. భగవత్ కిషన్రావ్ కరాడ్
- డా. రాజ్‌కుమార్ రంజన్ సింగ్
- డా. భారతి ప్రవీణ పవార్
- బిశ్వేశ్వర్ టుడు
- శాంతను ఠాకూర్
- డా. ముంజపారా మహేంద్రభాయ్
- జాన్ బార్లా
- డా. ఎల్. మురుగన్
- నిసిత్ ప్రమానిక్