More

    ఏపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై స్పందించిన కిషన్ రెడ్డి

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీకి అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని ప్రధాని మోదీ చెప్పారని.. అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఏది చేసినా రాజధాని మారే ప్రసక్తే లేదని తెలిపారు. రాజకీయాల్లో కక్షసాధింపు చర్యలు ఉండకూడదని కిషన్ రెడ్డి హితవు పలికారు. ఇతర రాజకీయ పార్టీ కార్యక్రమం చేస్తున్నప్పుడు… రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకూడదని అన్నారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుందని అన్నారు. రాజకీయ పార్టీలు తమ తమ కార్యక్రమాలు చేసుకోవాలని… అంతే కానీ కక్ష సాధింపు చర్యలు ఉండకూడదని అన్నారు. భారతీయ జనతా పార్టీ గా మొదటి నుండి అదే చెబుతున్నామని తెలిపారు.

    ఈ ఉదయం కిషన్ రెడ్డి విజయవాడకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఏలూరు, గుంటూరు జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

    Trending Stories

    Related Stories