Telugu States

ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాదయాత్ర కొనసాగుతోంది. తిరుపతిలో జన ఆశీర్వాద యాత్ర అనంతరం జరిగిన సభలో మాట్లాడిన కిషన్‌రెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మార్పు కోసం అధికారం అప్పగించిన ప్రజలకు సమన్యాయం చేయాలని జగన్‌కు సూచించారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసినా, వేయకున్నా ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నారని, కానీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ అలా చూడడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పామాయిల్ రైతులకు లబ్ధి చేకూర్చాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందనే విషయాన్ని తిరుపతి సభలో ప్రకటించాలని మోదీ తనతో చెప్పారన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తానని కిషన్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా గండికోట, సింహాచలం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర పథకాలు మినహా రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు. జల వివాదాలను తెలుగు రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని.. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలనేది కేంద్రం భావన అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వాటా నిధులు లేక కొన్ని కేంద్ర పథకాల పనుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. కరోనా సమయంలో ఏపీకి 4,500 వెంటిలేటర్లు, ఇంజెక్షన్లను కేంద్రం పంపింది. రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను మంజూరు చేసిందని తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అభివృద్ధి చేసిందని తెలిపారు. ‘దేఖో అప్నా దేశ్‌’ పేరుతో పర్యాటకరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే జనవరి నుంచి డిసెంబర్‌ వరకు పర్యాటకాభివృద్ధికి ప్రణాళిక రచిస్తున్నామని అన్నారు. కరోనా మూడో దశ రాకుండా ఉండాలంటే ప్రజల సహకారం కావాలని అన్నారు. దేశంలో చివరి వ్యక్తి వరకు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామన్నారు.

AP News: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం కనక దుర్గమ్మను దర్శించుకోనున్నారు. తెలంగాణలోని నల్లబండగూడెం నుంచి జన ఆశీర్వాదయాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం కోదాడ బహిరంగ సభలో కిషన్‌రెడ్డి పాల్గొంటారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

3 × 3 =

Back to top button