More

    ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం

    ఫలితాల వెల్లడిలో జాప్యం జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఎందుకు జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను ఎలా అప్ లోడ్ చేశారని ప్రశ్నించారు.

    నాలుగు రౌండ్లు ప్రకారం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 714 ఓట్లు లీడ్‌లో టీఆర్ఎస్ ఉందని ఈసీ వెల్లడించింది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ మండలంలో తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత 2,3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి రాగా.. నాలుగో రౌండ్ ముగిసేసరికి తిరిగి టీఆర్ఎస్ పుంజుకుంది.

    Trending Stories

    Related Stories