టీఆర్ఎస్ చౌకబారు రాజకీయాలు చేస్తోంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

0
855

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ సమావేశాలను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నాలు చేసిందని.. టీఆర్‌ఎస్‌ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కావాలనే బీజేపీకి పోటీగా నగరం మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ప్రజాధనాన్ని ఫ్లైక్సీలకు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్నా స్టీరింగ్‌ మాత్రం ఎంఐఎం చేతిలో ఉందని కిషన్‌రెడ్డి విమర్శించారు.

మరో వైపు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ ఏర్పాట్లు చేశారు. పార్టీ కార్యవర్గ సమావేశాల అనంతరం సాయంత్రం సమయంలో.. ప్రధాని మోదీ హెచ్‌ఐసీసీ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరు​​కుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.