డచ్ రాయబారికి దబిడి దిబిడే..

0
713

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మొదటి నుంచి భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూ వస్తోంది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. కానీ ప్రపంచ దేశాలు మాత్రం భారత్ పై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నాయి. మొన్నటి ఈయూ దేశాలతో పాటు అగ్రరాజ్యం అమెరికా కూడా భారత్ ను బెదిరించే ప్రయత్నం చేశాయి. భారత్ తిరిగి గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో మెతక వైఖరిని అవలంభించింది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో భారత్ ను నిందించే ప్రయత్నం చేసిన దేశాలకు క్లాస్ పీకారు భారత రాయబారి.

నెద‌ర్లాండ్స్ అంబాసిడ‌ర్‌కు ఇండియా క్లాస్ పీకింది. దేశ భ‌క్తి గురించి త‌మకు పాఠాలు చెప్ప‌వ‌ద్దు అని ఇండియా కౌంట‌ర్ ఇచ్చింది. ఉక్రెయిన్ అంశంలో ఐక్య‌రాజ్య‌స‌మితిలో జ‌రిగిన ఓటింగ్‌లో ఇండియా పాల్గొని ఉంటే బాగుండేద‌ని అంబాసిడ‌ర్ కారెల్ వాన్ ఊస్టోర‌మ్ ఓ ట్వీట్‌లో అన్నారు. దానికి యూఎన్ అంబాసిడ‌ర్ టీఎస్ తిరుమూర్తి స్పందించారు. దేశ‌భ‌క్తి గురించి త‌మ‌కు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని, ఇండియాకు ఏం చేయాలో తెలుసు అని ఆయ‌న ఓ ట్వీట్‌లో తెలిపారు.

ఇవాళ యూఎన్ అసెంబ్లీలోనూ తిరుమూర్తి మాట్లాడారు. ఇండియా శాంతిని ఆకాంక్షిస్తోంద‌న్నారు. ఉక్రెయిన్, ర‌ష్యా యుద్ధంలో విజేత‌లు ఎవ‌రూ ఉండ‌ర‌ని, ఈ యుద్ధం వ‌ల్ల ప్ర‌భావానికి గురైన‌వాళ్లు ఇబ్బందిప‌డుతూనే ఉంటార‌ని తిరుమూర్తి ఇండియా అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. దౌత్యం ఒక్క‌టే చివ‌ర‌కు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని ఆయ‌న అన్నారు. బుచాలో జ‌రిగిన మార‌ణ‌కాండ‌ను ఇండియా ఖండించింద‌న్నారు. అంత‌ర్జాతీయ ద‌ర్యాప్తును కోరింద‌న్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here