More

  నియంత కూతురు.. ‘కిమ్’నకుండా బయటికొచ్చింది..! అసలు రహస్యం అదేనా..?

  సస్పెన్స్, సీక్రేట్.. ఈ మాటలు వింటుంటే.. థ్రిల్లింగ్ సినిమాకు సంబంధించిన మేటర్ అనుకుంటున్నారా..అయితే, తప్పులో కాలేసినట్టి. అగ్రరాజ్యం అమెరికాను ఢీ కొట్టే సామర్థ్యం తమ క్షిపణికి వుందని ఊదరగొట్టేస్తోంది ఉత్తర కొరియా. ఈ అదరగొట్టడాలు, బెదరగొట్టడాలు..ఉత్తర కుమార ప్రగల్భాలా..లేక నిజాలా..అంత సీనుందా, అందులో దాగున్న రహస్యం ఏమిటి..అని ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. క్షిపణి పరీక్ష విషయంలో ఇన్ని అసక్తికర ప్రశ్నలు తలెత్తుతుంటే..దీన్ని మించిన వండర్ క్వశ్చన్, గ్రేట్ సీక్రెట్ విషయం ఒకటి బట్టబయలైంది. అయితే, ఈ సీక్రెట్స్ ఎపిసోడ్ చూసేముందు…నేషనలిస్ట్ గ్రూపాఫ్ ఛానెల్స్ ను సబ్ స్క్రయిబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.

  ఉత్తర కొరియా దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సీక్రెట్. 2012 జూలై వరకు కిమ్ కు పెళ్లయ్యిందో లేదో ఎవరికి తెలియదు. 2013 లో బ్రిటీష్ డైలే గార్డియన్ తో ముచ్చటిస్తూ బాస్కెట్ బాల్ మాజీ స్టార్ డెనిస్ రోడ్మన్..కిమ్ కు ఓ కుమార్తె వుందన్నారు. అసలు, కిమ్ వివాహం సంగతే ఎవరికి తెలియకపోవడంతో..కూతురు వుందని చెప్పడం అందరికీ ఆశ్చర్యం కల్గించింది. ఈ సీక్రెట్ సిట్యుయేషన్ లోనించే బయటకు రాలేకపోతుంటే…కిమ్ మంచి తండ్రని, కిమ్ భార్య రిసోల్ జుతో తాను మాట్లాడానని డెనిన్ చెప్పాడు. అయితే, అప్పటికి మూడేళ్ల క్రితమే వీరి వివాహాన్ని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఈ కథంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా…ఇప్పటవరకు వున్న రహస్యాలు, ఊహాగానాలు, వ్యాఖ్యానాలకు చెక్ పెట్టేస్తూ…. కిమ్ జోంగ్ ఉన్ చక్కగా భార్య, బిడ్డతో దర్శనమిచ్చాడు. కిమ్ కు పెళ్లి కాలేదు, కూతురు లేదనే వారు .. ఈ సీన్ చూసి నిశ్చేష్టులయ్యారు.

  ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ తొలిసారి కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించారు. తన ప్రైవేట్ లైఫ్‌ను ఎప్పుడూ గోప్యంగా ఉంచే కిమ్ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చింది. ఏడు నెలల క్రితం భార్యతో కలిసి కనిపించిన ఆయన తాజాగా కుమార్తెతో కనిపించడం చర్చనీయాంశమైంది. కుమార్తెతో కలిసి చేతిలో చేయి వేసి నడుస్తున్న కిమ్ ఫొటోలను అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రచురించింది. అయితే, కిమ్ కుమార్తె పేరును మాత్రం వెల్లడించలేదు. అయితే, అనధికారికంగా ఆమె పేరు కిమ్ చు-ఏ అని తెలుస్తోంది. ఓ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కిమ్ తన కుమార్తెను వెంటబెట్టుకొచ్చారు. ప్యాంగాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఇంటర్నేషనల్ బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించింది. నార్త్ కొరియా ఈ నెలలో ప్రయోగించిన రెండో ప్రయోగం ఇది. ఈ క్షిపణి 999.2 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర తీరంలో పడింది.

  అయితే, కిమ్ కూమార్తె తో కలిసి కనిపించడం ప్రధాన విశేషంగా భావించడానికి..సాధరణ ఆశ్చర్యకర విషయాలే కాదు, ఉత్తర కొరియా పారిపాలన, భవిష్యత్, అణ్వాయుధాల కార్యక్రమాలు..ఇలా బోల్డు బోల్డు…ప్రశ్నలు రేకెత్తిస్తాయి. తొలుత ప్రశ్న…ఈ పాప కిమ్ అధికార వారసత్వాన్ని కొనసాగిస్తుందా? భవిష్యత్తులో ఒక రోజు ఆమెను అధినేత్రిగా ప్రకటిస్తారా? కావచ్చు అనేది సమాధానం. ఎందుకంటే…ఇక్కడ కుటుంబ వారసత్వం నిషిద్ధం అనే మాట వినిపించలేదు. క్వశ్చన్ నెంబర్ టూ కు వెళితే.. ఇప్పుడెందుకు ఆమెను బయటకు తీసుకొచ్చారు? ఆమె ఇంకా చాలా చిన్నపిల్ల. ఇప్పుడే ఆ పాపను బయటకు తీసుకువచ్చారు..? 38 ఏళ్ల అధినేతకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇది మూడో క్వశ్చన్. ఎందుకంటే.. కిమ్ ఆరోగ్యం గురించి ఎప్పుడూ ఏవో ఒక ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. నార్త్ కొరియా అణ్వాయుధాల కార్యక్రమం గురించి ఇది ఏం చెబుతుందనేది మరో ప్రశ్న. ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి ఆమెను తీసుకురావడం, బహుసా భవిష్యత్తులో దేశ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో ఆమె ముఖ్య పాత్ర పోషిస్తుందని సూచించడం కావచ్చు.

  ఎట్టి పరిస్థితులలోనూ అణ్వాయుధాల ప్రయోగాలను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని కిమ్ ఇటీవల ప్రకటించారు. తన తరువాతి తరాలు సైతం తన అడుగుజాడల్లోనే నడుస్తాయని చెప్పడానికే కిమ్ ఈ క్షిపణి పరీక్షకు తన కూతురిని తీసుకుని వచ్చారా..అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. తండ్రి చేయి పట్టుకుని కిమ్ చు-ఏ ఈ ఈ ప్రయోగాన్ని వీక్షించింది. అయితే, ఈ క్షిపణి ప్రయోగాన్ని అమెరికా ఖండించింది. కిమ్ తన కూతురి చేయి పట్టుకుని నిల్చున్నట్టు ఉన్న ఫొటోలు, వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా తీసిన ఫొటోలు, అధికారులతో మాట్లాడుతున్నప్పుడు, క్షిపణి ప్రయోగాన్ని వీక్షిస్తున్నప్పటి పలు ఫొటోలను నార్త్ కొరియా ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ ప్రచురించింది. కిమ్ చు-ఏ వయసు 12-13 మధ్య ఉంటుందని వాషింగ్టన్‌లోని స్టిమ్సన్ సెంటర్‌కు చెందిన ఉత్తర కొరియా నిపుణుడు మైఖేల్ మాడెన్ అంచనా వేశారు. నాల్గవ తరం అధికార వారసత్వం సైతం తమ రక్తం నుంచే వస్తుందని చెప్పడానికే కిమ్ తన కూతురిని పబ్లిక్‌లోకి తీసుకువచ్చి ఉంటారని మైఖేల్ మాడెన్ అభిప్రాయపడ్డారు. అంతకుముందు, సెప్టెంబర్‌లో ఉత్తర కొరియా జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక వీడియోలో చు-ఏ కనిపించినట్టు నార్త్ కొరియా విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే, అవి ఊహాగానాలు కావచ్చు. ఆ పాప కిమ్ కూతురన్న విషయాన్ని నార్త్ కొరియా అధికార యంత్రాంగం ధృవీకరించలేదు.

  Trending Stories

  Related Stories