More

    నియంతను భయపెట్టిన మహమ్మారి.. మొదటిసారి అలా..!

    ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు ప్రపంచ దేశాలు కొంచెం దూరంగా ఉంటాయి. నిత్యం అణుబాంబుల తయారీ గురించి కిమ్ జోంగ్ ప్రస్తావిస్తాడు. మా జోలికొస్తే ఒక్క అణుబాంబు వేస్తా అంటూ హెచ్చరిస్తాడు. ఒకానొక సమయంలో అగ్రరాజ్యమైన అమెరికా సైతం కిమ్ జోంగ్ ఉన్‌తో మనకెందుకు అన్నట్లుగా వ్యవహరించిందంటే కిమ్ ఎంతటి నియంతో అర్థమవుతుంది.

    చైనాలో పుట్టి ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకిన కరోనా.. పక్కనే ఉండి ఉత్తరకొరియాలోకి మాత్రం ప్రవేశించలేదని చెబుతుంటారు. అక్కడికి కరోనా సోకి వచ్చిన వారిని ఆదేశ నియంత కిమ్ జాంగ్ చంపించాడని.. కరోనా వచ్చాక దేశంలోకి తలుపులు మూసేసి అరికట్టాడని ప్రచారం సాగింది. అయితే ఎంత కట్టడి చేసినా గాలిలో ప్రసరించే కరోనా ఆగుతుందా? ఆగలేదు.. ఆఖరుకు ఉత్తరకొరియాలోకి కూడా ప్రవేశించింది.

    ఉత్తరకొరియాలో గురువారం తొలి కోవిడ్ కేసు నమోదైంది. దీంతో భయపడిపోయిన ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మొట్టమొదటిసారి మాస్క్ ధరించి కనిపించాడు. కిమ్ జాంగ్ కూడా కరోనాకు భయపడ్డాడని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఉత్తర కొరియా దేశంలో ఒక్క కొవిడ్ కేసు నమోదు కాలేందంటూ ఇన్ని రోజులు ఉత్తర కొరియా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కాగా కోవిడ్ తొలి కేసు నమోదైన అనంతరం దేశంలోని ప్రభుత్వ నేతలు అధికారులతో కిమ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశానికి కిమ్ జాంగ్ మాస్క్ ధరించి రావడం విశేషంగా మారింది. దీంతో కిమ్ కూడా కరోనాకు భయపడిపోతున్నాడని అందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి కోవిడ్ కేసు ఉత్తరకొరియాలో నమోదు కావడంతో పలు నగరాల్లో లాక్ డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కార్యాలయాల మధ్య అనుసంధానాన్ని మూసేశారు. దేశంలో చాలా మందికి టీకాలు కూడా వేయలేదు. దీంతో కోవిడ్ వ్యాప్తిపై అనేక భయాలు వెంటాడుతున్నాయి. దీనిని గమనించిన కిమ్ ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది.

    మొదటి కేసు బయటపడడంతో ఉత్తరకొరియా హడావుడి మొదలుపెట్టింది. రాజధాని ప్యాంగ్యాంగ్ లో జ్వరాలతో బాధపడుతున్న వ్యక్తుల నుంచి సేకరించిన నమూనాలను పరిశీలించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు కొరియన్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. దీంతో అధ్యక్షుడు కిమ్ జాంగ్ మాస్క్ ధరించి కనిపించడం వైరల్ గా మారింది.

    కాగా.. ఇటీవల ఏప్రిల్ 25న ఉత్తర కొరియాలో కవాతు నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో పౌరులు, సైనికులు పాల్గొన్నారు. ఈ సమయంలో వైరస్ ప్రజలలో వేగంగా వ్యాపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఈ సమయంలో కిమ్ జోంగ్ వేదిక మధ్యలో నిలబడి ప్రసంగించడంతోపాటు.. సైనిక అణు కార్యక్రమంలో అత్యంత శక్తివంతమైన క్షిపణులను ప్రదర్శించారు.

    Trending Stories

    Related Stories