More

    లగ్జరీ అపార్ట్మెంట్ ను న్యూస్ యాంకర్ కు గిఫ్ట్ గా ఇచ్చిన కిమ్

    కిమ్ జాంగ్ వున్.. ఎప్పుడు చూసినా మిసైల్స్ టెస్ట్, పలు శిక్షలు, నార్త్ కొరియా ప్రజల మీద ఆంక్షలు అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు మనం చూస్తూ వచ్చాం. కానీ అతడు ప్రేమగా ఒకరికి బహుమతి ఇచ్చాడనే వార్తను ఎప్పుడైనా విన్నామా..? లేదు కదూ..! ఇప్పుడు అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ వున్ ఉత్తర కొరియాలోని ఒక ప్రముఖ జర్నలిస్టుకు విలాసవంతమైన ఫ్లాట్‌ను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. రి చున్ హాయ్ తన 50 ఏళ్ల కెరీర్‌లో ఉత్తర కొరియా టెలివిజన్‌కి పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఆమె ఉత్తర కొరియా బ్రాడ్‌కాస్టర్ కొరియన్ సెంట్రల్ టెలివిజన్‌కి న్యూస్ ప్రెజెంటర్ గా ఉన్నారు.

    రి చున్ హి 1994లో కిమ్ తండ్రి కిమ్ ఇల్ సంగ్ మరణం నుండి 2006లో నార్త్ కొరియా మొదటి అణ్వాయుధ పరీక్ష వరకు తన 50 ఏళ్ల కెరీర్‌లో ఉత్తర కొరియాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి వార్తలను అందించారు. రాజధాని ప్యోంగ్యాంగ్‌లోని రివర్‌సైడ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో కిమ్ జోంగ్ ఉన్‌తో కలిసి రి చున్ హి ఉన్న వీడియోను ఆ రాష్ట్ర మీడియా చూపించింది.

    KCNA మీడియా నివేదిక ప్రకారం.. ఆమె తన కొత్త ఇల్లు “హోటల్ లాగా ఉంది” అని కిమ్‌తో చెప్పింది. ఆమె కుటుంబం ” కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకుందని తెలిపింది. చాలా కాలంగా ప్రెజెంటర్‌గా పనిచేసిన ఆమె దేశంలోని అమూల్యమైన వ్యక్తుల్లో ఒకరని కిమ్ ఆమెకు చెప్పారు. వ్యవస్థాపక నాయకుడు కిమ్ జాంగ్ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ జన్మించిన శుక్రవారం 110వ వార్షికోత్సవం సందర్భంగా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌ను పూర్తి చేస్తున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. దేశం శ్రేయస్సు, అభివృద్ధికి దోహదపడిన వారికి ఇళ్లను బహుమతిగా ఇచ్చే ప్రాజెక్ట్‌ను కిమ్ ప్రారంభించారని KCNA నివేదిక పేర్కొంది. శుక్రవారం వార్షికోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా మరో అణు పరీక్షకు సిద్ధమయ్యే అవకాశం ఉందని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు హెచ్చరించారు.

    Trending Stories

    Related Stories