InternationalNational

పాక్‎లో హిందూ వ్యాపారి దారుణ హత్య

మానవ హక్కుల ఉల్లంఘన పాకిస్తాన్‎లో సర్వసాధారణమైన విషయం. అదే మైనార్టీల విషయంలో పరిస్థితి ఇంకా దారుణంగా వుంటుంది. అక్కడ మైనార్టీలైన హిందూ, సిక్కు, క్రిస్టియన్లపై దాడులు నిత్యకృత్యంగా జరుగుతూనేవుంటాయి. ఈ దాడుల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒక్కటి చోటుచేసుకుంది. పాకిస్తాన్ లో హిందూ వ్యాపారి అశోక్ కుమార్ మే 31న దారుణ హత్యకు గురయ్యాడు. ఐఎస్ఐ ఏజెంట్లుగా భావిస్తున్న పలువురు వ్యక్తులు.. అశోక్ కుమార్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన అశోక్ కుమార్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే, అశోక్ కుమార్ అప్పటికే ప్రాణాలు విడిచాదు.

హిందూ వ్యాపారిని చంపిన స‌మాచారం తెలియ‌గానే వాద్ బ‌జార్‌లోని వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసి జాతీయ రహదారిపై బారికేడ్లు వేసి అడ్డుకున్నారు. అటు బలోచిస్తాన్ నేషనల్ పార్టీకి చెందిన వర్కర్స్ అండ్ ట్రేడర్స్ వ్యాపారుల ఆందోళనకు మద్దతు పలికారు. రోడ్లపై బైఠాయించి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఖుజ్దార్-కరాచీ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ తర్వాత నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదిలావుంటే, పాకిస్తాన్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన మైనారిటీలపై దారుణానికి సంబంధించిన అంశంపై భారత ప్రపంచ ఫోరం సెక్రటరీ జనరల్ పునీత్ సింగ్ చందోక్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లో నివసిస్తున్న సిక్కు మత సమాజానికి లేదా భారతదేశానికి చెందిన హిందూ మతం వారికి ఎటువంటి అపాయం జ‌రుగకుండా ఉండటానికి భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

పాకిస్తాన్ లో మైనార్టీలపై దాడులు సర్వసాధారణం. మైనార్టీలైన ముస్లిమేతర మతస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటారు. ముఖ్యంగా హిందూ అమ్మాయిలపై జిహాద్ అక్కడ సర్వసాధారణమైన విషయం. అమ్మాయిలను కిడ్నాప్ చేసి మతం మార్చి, బలవంతంగా వివాహం చేసుకుంటారు. అయినా, అక్కడి అధికారులు, పాలకులు చూసీచూడనట్టు వ్యవహరిస్తారు. పాకిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ స్థాయిలో ఎన్నిసార్లు చివాట్లు తిన్నా.. ఉగ్రవాదానాకి వత్తాసు పలికే అక్కడి పాలకులు వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 4 =

Back to top button