International

టైలర్ హంతకులపై పాక్ రాడికల్స్ ప్రశంసలు.. భగ్గుమన్న భారతావని..!

ఉదయపూర్ టైలర్ హత్య ఉదంతంపై పాకిస్థాన్ రాడికల్స్ ప్రశంసించిన ఘటనపై భారతదేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో టైలరు తల నరికి చంపిన ఇద్దరు హంతకులను పాక్ ఇస్లామిస్ట్ రాడికల్స్ ప్రశంసించారు.

పాకిస్థాన్ దేశానికి చెందిన తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ తో సంబంధం ఉన్న రాడికల్స్ సంస్థ ఉదయ్‌పూర్ టైలర్ హత్యను ఆన్‌లైన్‌లో హర్షించారు.ఉదయ్‌పూర్ నిందితులను అభినందిస్తూ సందేశాలు పంపడం వివాదాస్పదంగా మారింది. బరేల్వీ వర్గానికి చెందిన పాక్ రాడికల్స్ ఉదయపూర్ టైలర్ శిరచ్ఛేదం చేసిన ఘటన ప్రతీకారంగా అభివర్ణించారు. ఉదయపూర్ శిరచ్ఛేదం చేసిన నిందితులకు మద్ధతుగా గత రెండు రోజుల నుంచి రాడికల్స్ ట్వీట్లు చేశారు. తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్థాన్ సంస్థ అనేది బారెల్వి రాడికల్ సంస్థ. ఈ సంస్థ దైవదూషణ చేసేవారికి శిరచ్ఛేదానికి పిలుపునిస్తుంది. మొత్తం మీద ఉదయపూర్ హంతకులకు పాక్ రాడికల్స్ ప్రశంసించడం ద్వారా ఈ హత్య ఉదంతంలో వారి పాత్ర ఉందని తేటతెల్లమైంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

six − six =

Back to top button