More

    ఎనిమిది నెలల బాలికతో సహా.. భారత సంతతి కుటుంబం హత్య

    అమెరికాలోని కాలిఫోర్నియాలో కిడ్నాప్ అయిన ఎనిమిది నెలల బాలికతో సహా అమెరికాలోని భారతీయ సంతతి కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు దారుణహత్యకు గురయ్యారు. ఎనిమిది నెలల అరూహి ధేరి, ఆమె తల్లిదండ్రులు 27 ఏళ్ల జస్లీన్ కౌర్, 36 ఏళ్ల జస్దీప్ సింగ్.. సోమవారం నాడు ఉత్తర కాలిఫోర్నియాలోని మెర్సిడ్ కౌంటీ నుండి కిడ్నాప్ అయ్యాడు. పాప మేనమామ 39 ఏళ్ల అమన్‌దీప్ సింగ్ కూడా కిడ్నాపయ్యాడు.

    కాలిఫోర్నియా అధికారులు 36 ఏళ్ల జస్ దీప్ సింగ్, 27 ఏళ్ల జస్లీన్ కౌర్, వారి ఎనిమిది నెలల చిన్నారి అరూహి దేరి, వారి సమీప బంధువు అమన్ దీప్ సింగ్ (39) ఇండియానా రోడ్డు, హచిసన్ రోడ్డు సమీపంలో నిర్జీవంగా కనిపించినట్టు తెలిపారు. స్థానిక రైతు వీరి మృతదేహాలను చూసి అధికారులకు సమాచారం ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. జీసస్ మాన్యుయేల్ సల్గాడో అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అతడ్ని హాస్పిటల్ కు తరలించారు. జస్ దీప్ సింగ్ ఇటీవలే ట్రక్ రెంటింగ్ కంపెనీని ప్రారంభించాడు.

    అపహరణకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన క్షణాన్ని చూపించే వీడియోను విడుదల చేశారు. వీడియోలో జస్దీప్, అమన్‌దీప్ చేతులు కట్టివేయబడి.. బయటకు వస్తున్నట్లు చూపబడింది. కొన్ని సెకన్ల తర్వాత, శిశువు, ఆమె తల్లి కిడ్నాపర్‌తో భవనం నుండి బయటకు రావడం చూడవచ్చు. సంఘటనా స్థలం నుండి బయలుదేరే ముందు కుటుంబంలోని నలుగురు సభ్యులను ట్రక్కులో ఎక్కించారు.

    Trending Stories

    Related Stories