More

    వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ లో ట్విస్ట్.. ఆయనపై కిడ్నాప్ కేసు..!

    నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదయింది. తన అనుచరులతో కలిసి కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వేదాయపాలెం ఇన్స్ పెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ.. వైసీపీని వీడి తనతో రావాలంటూ నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డికి కోటంరెడ్డి ఫోన్ చేశారు. విజయభాస్కర్ రెడ్డి దానికి నిరాకరించడంతో తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, డ్రైవర్ అంకయ్యతో కలిసి వెళ్లి ఆయనను బెదిరించారు. కార్పొరేటర్ ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా, ఆయన తప్పించుకుని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

    ఇక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో వైరల్ అవుతోంది. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరంలో లేదు. ఐదు నిమిషాల్లో వచ్చి లాక్కెళ్తా అని కోటంరెడ్డిని బోరుగడ్డ అనిల్ హెచ్చరించాడు. అనిల్ ఫోన్ లో మాట్లాడుతూ మీ కథ మొత్తం నాకు తెలుసని.. మీ తమ్ముడు కూడా నీ కంటే ఎక్కవగా మాట్లాడుతున్నాడని.. మీ ఇద్దరినీ ప్రజలు తరిమికొడతారన్నాడు. డేట్ ఫిక్స్ చేసుకోమని.. నీ ఇంటికి వచ్చి కట్టుకుని పోతానని తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. ముఖ్యమంత్రిని తాను ఏమీ అనలేదని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా అనిల్ బెదిరింపులకు దిగాడు.

    Trending Stories

    Related Stories