More

    మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పిన కిచ్చా సుదీప్

    మీడియా ప్రతినిధులకు ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ క్షమాపణలు చెప్పారు.కొచ్చి, చెన్నై, హైదరాబాద్‌లో జరగాల్సిన ప్రెస్‌మీట్‌ను రద్దు చేసినందుకు కిచ్చా సుదీప్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో మీడియా సోదరులకు క్షమాపణలు చెప్పారు. చివరి నిమిషంలో అన్ని సమావేశాలను రద్దు చేయడానికి కారణం తన అనారోగ్య కారణాలే అని పేర్కొన్నాడు. త్వరలో తిరిగి వచ్చి అందరినీ కలుస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని, త్వరలో పనిని తిరిగి ప్రారంభిస్తానని చెప్పాడు.

    అనారోగ్య కారణాలతో ప్రెస్ మీట్లకు హాజరు కాలేకపోతున్నానని… తనను క్షమించాలని కోరాడు. సుదీప్ తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి అనూప్ బండారి దర్శకత్వం వహించారు. సోషియో ఫాంటసీ, యాక్షన్ అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్, చెన్నై, కొచ్చిలలో ప్రెస్ మీట్స్ నిర్వహించాల్సి ఉంది. ఆయన అనారోగ్యానికి గురయ్యారు. అనారోగ్యం వల్ల ప్రయాణాలు చేయలేకపోతున్నానని, అందుకే ఈ రోజు జరగాల్సిన ప్రెస్ మీట్స్ రద్దు చేస్తున్నామని చెప్పారు. ఇక తాను అంగీకరించిన రియాలిటీ షో ప్రారంభ ఎపిసోడ్‌లో పాల్గొనలేకపోయినందుకు విజయటీవీలోని నా స్నేహితులకు నేను క్షమాపణలు కోరుతున్నానన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories