Telugu States

సత్యసాయి జిల్లాలో పరువు హత్య..?

సత్యసాయి జిల్లా కనగానపల్లిలో యువకుడి హత్యను పరువు హత్యగా భావిస్తూ ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిట్ర మురళి (27) పీజీ పూర్తిచేసి పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వీణ డిగ్రీ పూర్తి చేసి మూడేళ్ల నుండి గ్రామ మహిళా పోలీసుగా ఉద్యోగం చేస్తూ ఉంది. ప్రస్తుతం ఏలుకుంట్ల గ్రామ సచివాలయంలో విధులు నిర్వర్తిస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీణ, మురళి గతేడాది జూన్‌లో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత రాప్తాడులో కాపురం పెట్టారు. డైలీ డ్యూటీలో భాగంగా రాప్తాడు వై జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి చూస్తున్న మురళిని గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అపహరించారు. ఇంటికి చేరుకున్న వీణ.. భర్తకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో వెంటనే స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. ఆచూకీ లేకపోవడంతో రాప్తాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా లింగనపల్లి-రామినేపల్లి గ్రామాల మధ్య మురళి విగత జీవిగా కనిపించాడు.

కత్తితో మెడకోసి హత్య చేసి సమపంలోని పొలంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. రాత్రి నుంచి మురళి ఫోన్‌ పనిచేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకుఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకుశుక్రవారం ఉదయం త్రిబుల్‌ ఆర్‌ రెస్టారెంట్‌ వద్ద యువకుని మృతదేహాన్ని గుర్తించి మురళి కుటుంసభ్యులకు సమాచారం ఇచ్చారు. తాము ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేక తల్లే తన భర్తను హత్య చేయించిందని వీణ ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి కుటుంబ సభ్యులే తమ కుమారుడిని హత్య చేశారని యువకుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Articles

Back to top button