More

    కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వే లైన్ ప్రారంభించనున్న మోదీ

    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రోడ్డు కొత్తగూడెం నుండి సింగరేణి వరకు రైల్వేమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రామగుండం నుండి వర్చువల్‎గా ప్రారంభించనున్నారు. దశాబ్దకాలంగా చూస్తున్న ఈ రైల్వే మార్గం నేటికీ సహకారం అయింది. సింగరేణి, రైల్వేశాఖ భాగస్వామ్యంతో కొత్తగూడెం
    నుండి సత్తుపల్లి వరకు రైల్వే మార్గాన్ని నేడు ప్రధాని మోదీ జాతికి అంకితం ఇవ్వనున్నారు. రామగుండం పర్యటనలో భాగంగా ఆయన
    వర్చువల్ విధానంలో రైల్వేమార్గాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ట్రయల్ పూర్తి చేసుకున్న ఈ మార్గంలో అధికారికంగా నేటి నుండి ప్రారంభం కానున్నాయి. కొత్తగూడెం భద్రాచలం రోడ్డు స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ మార్గం సత్తుపల్లిలోని లంకపల్లి వద్ద ముగిస్తుంది. అక్కడి నుండి గనుల వద్ద నిర్మించిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ వరకు మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల దూరం వరకు సింగరేణి సొంతంగా నిర్మించుకుంది. రైల్వేలైను పూర్తిచేసుకుని మొత్తంగా సింగరేణి సొంతంగా 10.17 కిలోమీటర్ల మేర రైలు మార్గాన్ని ఏర్పాటు చేసుకోగా దీనికి 618.5 5కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు రైల్వేశాఖ 309.39 కోట్ల రూపాయల భాగస్వామ్యాన్ని అందించింది. మొత్తంగా 927.94 కోట్ల ఖర్చు రైల్వే లైనుకు అయింది. ఇదిలా ఉంటే కొత్తగూడెం నుంచి 54.10 కిలోమీటర్ల దూరం ఈ రైల్వే మార్గం నిర్మించారు. 2022 మే 28న ట్రయల్ రన్‎తో ప్రారంభమైన ఈ రైలు మార్గంలో సింగరేణి ఏడాదికి 100 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయనుంది.

    Trending Stories

    Related Stories