భారత్ కెనడాల మధ్య స్నేహ పూర్వక వాతావరణాన్ని పెంపొందిచేందుకు అక్కడ ఉంటున్న కెనడియన్ ఇండియన్స్ ఒక ర్యాలీ చేసారు. దీనిని జీర్ణించుకోలేని ఉగ్రవాద ఖలిస్తానీ గ్రూపులు దారుణంగా వ్యవహరించారు. వెళ్లి యూరిన్ తాగండి అంటూ దుర్భాషలాడుతూ.. భారత త్రివర్ణ పతాకాన్ని ఘోరంగా అవమానించారు.
ఈ ఘటన జరిగింది ఫిబ్రవరి 28వ తారీఖున ఇరు దేశాల సంబంధాలు బలపడాలనేదానికి సూచికగా అక్కడి మన భారతీయులు ర్యాలీ తీయడం జరిగింది. ర్యాలీని విజయవంతం చేసేందుకు వందలాది మంది కదిలి వచ్చారు. ఇందులో పాల్గొన్న వారు మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి ఎంతోమందిని పొట్టనపెట్టుకుంది. అటువంటి క్లిష్ట సమయంలో కెనడా, భారత్ ప్రధానులు ట్రూడో, మోదీలు పూర్తి సమస్వయంతో, సహకారభావంతో మెలిగి లక్షలాది వ్యాక్సిన్ లను సరఫరా చేయడంలో సఫలీకృతులయ్యారు. ఇది చాలా గొప్ప విషయం అని తెలిపారు.
కొనసాగింపుగా మాట్లాడుతూ.. భారత్ కు చాలా థాంక్స్… సనాతన వేదం చెప్పినట్లుగా వసుదైక కుటుంబకం దిశగా భారత్ నడుస్తోందని తెలిపారు. రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలయినటువంటి కెనడా భారత్ ల మధ్య బంధం బలోపేతమయ్యేలా.. కెనడాకు ఇండియా వ్యాక్సిన్ లు పంపడం జరిగిందన్నారు. ఇప్పటికే భారత్ ఆ దిశగా 40కిపైగా దేశాలకు వ్యాక్సిన్ లను సరఫరా చేసిందని గుర్తుచేశారు.
ఇటీవలే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా భారత దేశానికి, ఆస్ట్రా జెనికా టీకాలు అందించిన సీరం ఇన్ స్టిట్యూట్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 20 లక్షల డోసులను అందుకున్న ఆ దేశం అదనంగా మరో 2 లక్షల డోసులకోసం ఆర్డర్ చేసుకుంది.
ఇటువంటి విషయాలకు సంఘీభావంగా శాంతి యుతంగా అక్కడి మన వారు ర్యాలీ తీస్తే బలిసి కొట్టుకుంటున్న ఉగ్రమూకల సంస్థ అయిన ఖలిస్తానీలు అడ్డొచ్చి అలజడి సృష్ఠించారు. అంతటితో ఆగకుండా దాడులు చేశారు. ట్రాఫిక్ జాం అయ్యేలా చేశారు.
అలాగే మరో వీడియోలో NDP లీడర్ జగ్ మీత్ సింద్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న హిందూ కమ్యూనిటీకి చెందిన ఒకామె.. ఆ ఏరియాలో ప్రో ఖలిస్తానీ నిరంతర దాడులు గురించి.. హిందువల పట్ల జరుగుతన్న వివక్ష గురించి వివరించారు. దీనికై ఆమె ఆ దేశ ఎన్డీపీ లీడర్ కు విన్నవించుకుంటూ తన ఆవేదన వెలుబుచ్చారు. హిందువుల షాపులను కూడా బాయ్ కాట్ చేస్తున్నారని తెలిపారామె.
ఇంకో వీడియో అయితే నేను భారతీయుడను అని అనుకునే ఎవరూ చూసి జీర్ణించుకోలేనిది. అందులో ఏకంగా ర్యాలీ తీస్తున్న వాహనాలకు ముష్కర వాహనాలను అడ్డుగా నిలిపేశారు. అంతటితో ఆగకుండా క్రిందకు దిగిన ఒక ఉగ్రవాది మన జాతీయ జెండాను తీసేస్కుని కాలి క్రింద తొక్కి ఉగ్రానందాన్ని పొందాడు.
అక్కడయినా.. ఇక్కడైనా వీరి టార్గెట్ ఇండియన్స్… ఇండియా..
అందుకే ఇక్కడి ద్రోహులతో చేతులు కలిపి దేశాన్ని అస్థిర పరచాలనుకునే కుట్రలు పన్నుతున్నది..
జనాలకు మేం చెప్పలానుకునే అసలు నిజాలివే..
ఏ తెలుగు మీడియా ఇవి చూపించదు.. కారణం ఈ దేశంలో మనం జాగరూకులు అవ్వకూడదు.. సో.. బీ ఎవేర్..