More

    పంజాబ్ లో ఖలిస్తానీ వేర్పాటువాది అరెస్ట్.. నివురు గప్పిన నిప్పులా పరిస్థితి..!

    పంజాబ్ రాష్ట్రంలో ఇంటర్నెట్ ను బంద్ చేశారు అధికారులు. ఖలిస్తానీ లీడర్, వారిస్ పంజాబ్ డి చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు. మార్చి 18వ తేదీ జలంధర్ లోని నకోదర్ సమీపంలోని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఆరుగురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. అమృత్ పాల్ సింగ్ ను 50 వాహనాల్లో వెంబడించి మరీ అదుపులోకి తీసుకున్నారనే వార్తలు వచ్చాయి. పంజాబ్ లో ప్రత్యేక వేర్పాటు వాదులు ఆందోళనలకు దిగడంతో పోలీసులను భారీగా మోహరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల దృష్ట్యా ఇంటర్నెట్ బంద్ చేశారు. ఎస్ఎంఎస్ సేవలను సైతం నిలిపివేసింది పంజాబ్ ప్రభుత్వం. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, రోడ్లపై ఆందోళనలు చేసినా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రజలు ఎవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని ప్రకటించారు పంజాబ్ పోలీసులు.

    అమృత్ పాల్ సింగ్ తన బృందంతో పోలీసులను బెదిరించింది. అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి చేసి తన అనుచరులను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. ఆ దాడిలో చాలా సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి పరారీలో ఉన్న అమృత్ పాల్ సింగ్, అతని అనుచరులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు పోలీసులు. అమృత్‌సర్ జిల్లాలోని అమృతపాల్ సింగ్ గ్రామం జల్లుపూర్ ఖైరా వెలుపల భారీగా పోలీసులను మోహరించారు.

    Trending Stories

    Related Stories