జాతి విచ్ఛిన్నకర శక్తులు.. దేశాన్ని ముక్కులు చేసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఇప్పటికే రైతు ఉద్యమాల ముసుగులో అల్లకల్లోలం సృష్టించిన ఖలిస్తానీ వేర్పాటువాదులు.. దేశం నుంచి పలు రాష్ట్రాలను వేరుచేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఓ ఖలిస్తానీ ఉగ్రవాది విడుదల చేసిన వీడియో.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఆ వీడియోలో దేశానికి వ్యతిరేక కారుకూతలు కూశాడు. మీరు ముఖ్యమంత్రుల స్థాయి నుంచి ప్రధానమంత్రుల స్థాయికి ఎదగాలంటే.. దేశం నుంచి విడిపోవాలంటూ ఇద్దరు సీఎంలకు సలహా ఇచ్చాడు.
గురుపట్వంత్ సింగ్ పన్ను.. నిషేధిత ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అధినేత. ఇతగాడు తాజాగా యూట్యూబ్ లో ఓ వీడియో అప్ లోడ్ చేశాడు. ఆ వీడియోలో జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఇందులో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేలకు ఉచిత సలహా ఇఛ్చాడు. దేశం నుంచి విడిపోయి.. రెండు రాష్ట్రాలను స్వతంత్ర్య దేశాలుగా ప్రకటించుకోవాలని సూచించాడు. మీ చేతిలో పవర్ ఉందని.. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని దేశం నుంచి విడిపోవాలంటూ కారుకూతలు కూశాడు.
పన్ను ఇందుకు కారణాలు కూడా చెప్పాడు. మహరాష్ట్రీయులు, బెంగాలీలు తమ భాషా సంస్కృతులను కాపాడుకోవాలంటే భారత ఆధిపత్యం నుంచి బయటికి రావాలని నోరు పారేసుకున్నాడు. అంతేకాదు, రెండు రాష్ట్రాలను ఏకపక్షంగా స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకునే హక్కు వారికి వుందని.. ఇందుకు అంతర్జాతీయ చట్టం మద్దతు కూడా వుంటుందని తెలిపాడు. భారత్ లో కొనసాగితే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎలాంటి గుర్తింపు లభించదని అన్నాడు. అంతేకాదు, మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలకు.. భారత ప్రభుత్వం అనుసరిస్తున్న యాంటీ మహారాష్ట్ర, యాంటీ బెంగాల్ విధానాలే కారణమంటూ విషం కక్కాడు.
అంతటితో ఆగకుండా తన సలహా పాటిస్తే.. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులవుతారని.. చరిత్రలో నిలిచపోతారని కూడా కారుకూతలు కూశాడు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలను స్వతంత్ర దేశాలుగా ప్రకటిస్తే.. తమ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ సంస్థ మద్దతు తెలుపుతుందని కారుకూతలు కూశాడు. స్వతంత్ర దేశంగా ఏర్పడటానికి కొసావో దేశానికి అంతర్జాతీయ న్యాయస్థానంలో మద్దతు ఇచ్చామని.. అలాగే, బెంగాల్, మహారాష్ట్రలకు కూడా మద్దతు తెలుపుతామంటూ విషం చిమ్మాడు.
ఈ వీడియో చూసిన సగటు భారతీయుడి గుండె మండిపోతోంది. సోషల్ మీడియా వేదికగా భారతీయులంతా ఆవేశంతో రగిలిపోతున్నారు. విదేశాలకు తొత్గుగా పనిచేస్తున్న.. ఈ వేర్పాటువాద ఉగ్రవాదిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇంత జరిగినా.. దేశానికి వ్యతిరేకంగా ఒకడు ఇంత బాహాటంగా కారుకూతలు కూసినా కూడా.. కుహనా లౌకికవాదులు స్పందించడం లేదు. విదేశాలకు కొమ్ముకాసే ‘టూల్ కిట్’ మేధావులు ఒక్కడు కూడా నోరుమొదపడం లేదు. కనీసం ఈ వేర్పాటువాది వ్యాఖ్యలను ఖండిచే ప్రయత్నం కూడా చేయడం లేదు. అయినదానికి, కానిదానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాలరెగిరేసే కమ్మీ, కాంగీ మేధావులు నుంచి స్పందన కరువైంది.
ఇదంతా ఒకెత్తయితే.. ఈ ఖలిస్తానీ వేర్పాటువాదిపై కనీసం బెంగాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో దేశ ప్రజలు ఇద్దరు సీఎంలపై దుమ్మెత్తిపోస్తున్నారు. మీ వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నిస్తున్నారు..?