దివంగత కాంగ్రెస్ పార్టీ నేత పి.జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్లో కొనసాగుతున్న ఆమె జీహెచ్ఎంసీ కార్పొరేటర్గానూ కొనసాగుతున్నారు. టీఆర్ఎస్లో ప్రాధాన్యత దక్కడం లేదన్న భావనతో ఆమె ఉన్నారు. ఇటీవలే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయిన విజయారెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నట్లుగా తెలిపారు. ఆమె ప్రతిపాదనకు ఓకే చెప్పేసిన రేవంత్.. విజయారెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. తాజాగా గురువారం విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరుల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీజేఆర్ కూతురు అయిన విజయారెడ్డి తమకు సోదరి అని పేర్కొన్న కోమటిరెడ్డి… ఖైరతాబాదే కాకుండా ఎక్కడ నిలుచున్నా విజయారెడ్డి ఎమ్మెల్యే అవుతారని చెప్పారు.