More

    కేరళ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జేపీ నడ్డా.. బీజేపీ నేత హత్యపై సీసీటీవీల్లో..!

    భారతీయ జనతా పార్టీ కేరళ రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకుడు రెంజిత్ శ్రీనివాసన్ హత్య తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుని కేరళలో వరుస దాడులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. దీంతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేరళ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి విజయన్ పినరయి ఆధ్వర్యంలో కేరళ చట్టవిరుద్ధమైన రాష్ట్రంగా మారిందని జేపీ నడ్డా ఆదివారం ఆరోపించారు.

    SDPI రాష్ట్ర కార్యదర్శి హత్య తరువాత, ఒక BJP నాయకుడిని నరికి చంపారు. ఆదివారం మొత్తం అలప్పుజా జిల్లాలో నిషేధాజ్ఞలు విధించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. SDPI రాష్ట్ర కార్యదర్శి KS షాన్ ఇంటికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. షాన్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, కారులో వచ్చిన ముఠా అతడిని అడ్డగించి, బైక్‌ను ఢీకొట్టారు. ఆ తర్వాత పదునైన వస్తువుతో పొడిచినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో కొచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 12 గంటల తర్వాత భారతీయ జనతా పార్టీ ఓబీసీ విభాగం కార్యదర్శిగా ఉన్న బీజేపీకి చెందిన రెంజిత్ శ్రీనివాసన్ ఇంట్లోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి అతన్ని నరికి చంపారు.

    భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దాడులను ఖండిస్తూ ఉన్నారు. జేపీ నడ్డా సైతం ఇలాంటివి కొనసాగుతూ ఉంటే తాము సహించబోమని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ‘ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్‌ రెంజిత్ శ్రీనివాసన్ హత్య ఖండించదగినదని. ఇలాంటి పిరికిపంద చర్యలను సహించలేమన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆధ్వర్యంలో కేరళ చట్టవిరుద్ధమైన రాష్ట్రంగా మారుతోంది. మీ క్రూరత్వంతో మమ్మల్ని భయపెట్టలేరు.’ అని నడ్డా చెప్పుకొచ్చారు. ఈ హత్యలను ఖండించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిందితులను, వారి వెనుక ఉన్న వారిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.

    సీసీటీవీల్లో బైక్ ల మీద దుండగులు:

    బీజేపీ ఓబీసీ మోర్చా కార్యదర్శి రెంజిత్ శ్రీనివాసన్ మరణానికి ముందు ఆయన ఇంటికి గుర్తుతెలియని దుండగుల బృందం వెళ్లిన దృశ్యాలు కేరళలోని అలప్పుజలో బయటపడ్డాయి. దుండగులు తమ బైక్‌లపై ప్రయాణిస్తున్నారు.. అందరూ హెల్మెట్‌లను ధరించి ఉన్నారు. నేరం చేసిన తర్వాత అదే రహదారిలో అక్కడి నుండి వెళ్లిపోయినట్లు కనిపించింది. మొత్తం పన్నెండు మంది దుండగులు ఆరు బైక్‌లపై వచ్చారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీనివాసన్‌ను గుర్తు తెలియని దుండగులు ఇంట్లోనే నరికి చంపారు.

    https://www.indiatoday.in/india/story/cctv-bike-borne-assailants-bjp-leader-death-kerala-alappuzha-1889706-2021-12-20?jwsource=cl

    Trending Stories

    Related Stories