More

  PFI వల్ల కేరళ ప్రభుత్వానికి లక్షల్లో ఆస్తి నష్టం.. రికవరీ కోసం హైకోర్టు ఆదేశం..

  లేనిపోని సాకులతో..ఉట్టిపుణ్యాన గొడవల పడి రోడ్డెక్కి ఆందోళన చేయడం చాలామందికి ఫ్యాషన్ గా మారింది. అదేం మాయదారి పోరాటాలో కాని.. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు.. తమకు కోపాలు, తాపాలు వచ్చేస్తే.. బంద్ లు, హర్తాళ్ లు చేసేస్తారు, హింసాకాండలు సాగిస్తారు. బస్సులు బద్దలు కొడతారు. ప్రభుత్వ కారాలయాలు కొల్లగొడతారు. ఇలా ఒకటేమిటి.. కనిపించిన ప్రభుత్వ ఆస్తులన్నింటిని ధ్వంసం చేస్తారు. ఆ అర్థం లేని కోపం తారాస్థాయికి చేరితే.. వ్యక్తుల మీద దాడులు చేస్తారు, సంస్థలను నేలమట్టం చేస్తారు.

  అకారణంగా కలహానికి కాలు దువ్వే దిక్కుమాలిన సంస్థ ఏదంటే.. చిన్నపిల్లాడైనా ఠక్కున చెబుతాడు PFI అని. బంద్ అంటే ముందు వరుసలో నిలబడ్డం, హార్తాళ్ అంటే వికటాట్టహాసం చేస్తూ రెచ్చిపోవడం.. ఇవీ PFI కార్యకలాపాల్లో ప్రధాన ఘట్టాలు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు అనే మాట.. ఈ PFI చెవికి ఎప్పుడూ ఎక్కదు.

  ఈ గూండాగిరి ఆగడాలు ఎన్నాళ్లని.. సామాన్య ప్రజలు మూగ వేదన పడుతున్నారు. ఇదేం అని ప్రశ్నిస్తే.. వినయంగా సమాధానం చెప్పడానికి వాళ్లేమైన మనుష ప్రవృత్తి కల్గినవాళ్లా..? వివేక, విచక్షణలు లేని పశువులకు, క్రూర మృగాల్లా ప్రవర్తించే నరరూప రాక్షసులకు.. ఇది తప్పని ఎవరు చెప్పగలరు. ఈ ఆగడాలు ఎన్నాళ్లు భరించాలి. సర్కారు సంపదను ఇంకా ఎంత కోల్పోవాలి.. మదిలో రగిలే ఈ ప్రశ్నలతో.. ఇప్పుడు కేరళవాసులు ఆవేదన చెందుతున్నారు.

  రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, అరాచకాలు పెరిగిపోయాయి. PFI చేసే పాడు పనులు అన్నీ ఇన్నీకావు. అప్పుడెప్పుడో.. రోమ్ నగరం తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ వినోదంలో తేలియాడాట్ట. ఇంత హింసాకాండలు జరుగుతూ, PFI గూండాలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తుంటే.. రాష్ట్ర సర్కారు మొద్దు నిద్రలో జోగుతోంది. అయితే, ఉన్నత న్యాయస్థానం మాత్రం ఈ అంశంపై సీరియస్ అయ్యింది. ప్రజా ఆస్తులకు నష్టం కల్గిస్తే సహించేది లేదని తెలియజేసింది. PFI ఆందోళనలు, అల్లర్లు, హర్తాళ్ల కారణంగా కేరళ ప్రభుత్వానికి సుమారు 86 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది.

  పాడు పని చేస్తే పంచన చేర్చుకుని పంచభక్షపర్వాన్నాలు పెడతారా..? అందుకే ఎన్‌ఐఏ, పీఎఫ్‌ఐ పై కొరడా ఝళిపించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ స్థావరాలపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. తమ లొసుగులన్నీ బయటకొచ్చేసి, బండారం బయట పడిపోతుంటే.. PFI నేతలకు కాళ్లలో ఒణుకు రావడం మొదలెట్టింది. ఏం చేయాలో తెలియక.. మరో పిచ్చిపనికి రెడీ అయ్యారు. ఎన్‌ఐఏ కు ప్రతిస్పందన చర్య అంటూ హర్తాళ్ చేపట్టింది. ఈ ఒక్క రోజు ఆందోళనలో PFI చేసిన దారుణాలు, దాష్టీకాలు, ఆగడాలు అన్నీ ఇన్నీ కావు.

  PFI గూండాలు ప్రభుత్వ ఆస్తులను నేలమట్టం చేశారు. ప్రైవేటు ఆస్తులపైన విరుచుకుపడ్డారు. పౌర ప్రాంతాలపై పెట్రో బాంబులు విసిరారు. పోలీసు అధికారులపై దాడులకు దిగారు. తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, ఎర్నాకులం, కోజికోడ్, వాయనాడ్ జిల్లాల్లో పీఎఫ్‌ఐ మూకలు ప్రభుత్వ బస్సులు, కార్లను ధ్వంసం చేశాయి. 71 KSRTC బస్సులు దెబ్బతినగా, 11 మంది KSRTC ఉద్యోగులు గాయపడ్డారు.

  కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ హైకోర్టు ను ఆశ్రయించి PFI నుంచి తమకు భారీ పరిహారం ఇప్పించాలని కోరింది. మరమ్మతు పనుల తర్వాతే బస్సులు ప్రారంభమవుతాయని, అప్పుడే సర్వీసులను పునఃప్రారంభిస్తామని కార్పొరేషన్ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, KSRTC అంచనా వేసిన 5 కోట్ల 20 లక్షలు చెల్లించాలని కోర్టు PFI ని ఆదేశించింది. జరిమానాను రెండు వారాల్లోగా హోంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శికి జమ చేయాలని పీఎఫ్‌ఐని ఆదేశించింది.

  PFI హర్తాళ్ కేసుకు సంబంధించి కేరళ పోలీసులు ఇంతకుముందు 724 మందిని అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 23 న ‘సార్వత్రిక సమ్మె’ పేరుతో జరిగిన హింసకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 361 కేసులు నమోదు చేసి సుమారు 2674 మందిని అరెస్టు చేశారు.

  దేశంలోని దాదాపు 17 రాష్ట్రాల్లో వున్న PFI హబ్‌లపై NIA అధికారులు దాడులు చేసి, నేర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ‘మిషన్ 2047’కి సంబంధించిన బ్రోచర్, సిడి. PFI మహారాష్ట్ర విభాగానికి చెందిన కీలక పత్రం, PFI మహారాష్ట్ర రాష్ట్ర అధ్యక్షుడు ఇర్ఫాన్ మిల్లీ ఇంటి వద్ద వున్న PE శిక్షణా సామగ్రిని NIA అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, కర్ణాటక, తమిళనాడులోని PFI నాయకుల వద్ద వున్న అక్రమ నగదును పట్టుకున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ PFI, ISISకు సంబంధించిన వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్‌లు, తమిళనాడు PFI కు చెందిన మెరైన్ రేడియో సెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. వైర్‌లెస్ కమ్యూనికేషన్ పరికరాలతో సహా అనేక ఇతర వస్తువులను NIA అధికారులు సీజ్ చేశారు. ఇలా దేశ వ్యాప్తంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న PFI ను కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్ 27న బ్యాన్ చేసింది.

  Trending Stories

  Related Stories