అసువులు బాసిన మరో RSS కార్యకర్త.. కేరళలో పేట్రేగిపోతున్న PFI, SDPI

0
737

దేశవిద్రోహశక్తుల రక్తదాహానికి అంతులేకుండాపోతోంది. దేవభూమి కేరళను మరుభూమిగా మార్చేస్తున్నారు. RSS కార్యకర్తల వరుస హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో RSS కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. నరహంతక కమ్యూనిస్టు మూకల చేతుల్లో బలయ్యాడు. అలప్పూజ జిల్లాలో బుధవారం అర్థరాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

మొదట RSS కార్యకర్తలకు, SDPI సభ్యులకు మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. ఈ గొడవ కాస్తా పెద్దది కావడంతో రెచ్చిపోయిన SDPI కార్యకర్తలు.. రాహుల్ కృష్ణ అలియాస్, నందు కృష్ణ, అలియాస్ నందు అనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తను దారుణంగా చంపేశారు. పదునైన ఆయుధంతో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడిన నందు.. ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు విడిచాడు. తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురు RSS కార్యకర్తలు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ఆందోళ‌న‌కారుల‌ను చెద‌ర‌గొట్టారు. శాంతిభద్రతలు అదుపుతప్పకుండా అలప్పూజ జిల్లాలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

చెర్తాలా తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. గత కొద్ది రోజులుగా స్థానిక SDPI, RSS కార్యకర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ నిర్వహిస్తున్న ‘విజయ్ యాత్ర’ ప్రారంభోత్సవానికి ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. కాసర్ గోడ్ లో జరిగిన యోగి ప్రారంభోత్స సభకు వ్యతిరేకంగా.. వలయార్‌లోని SDPI నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది, ఈ సందర్భంగా అక్కడ సంస్థ నాయకులు కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ పర్యటనకు వ్యతిరేకంగా పలు అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పలువురు RSS కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో రెచ్చిపోయిన SDPI కార్యకర్తలు RSS కార్యకర్తలపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దాడిలో రాహుల్ కృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు సంబంధించి ఇప్పటివరకు 16 మంది SDPI సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలావుంటే, RSS కార్యకర్త హత్యకు నిరసనగా.. అలప్పుజలో 12 గంటల షట్‌డౌన్ చేయాలని బీజేపీ, ఇతర అనుబంధ సంస్థలు పిలుపునిచ్చాయి. ఈ సంఘటనను నిరసిస్తూ బీజేపీ, ఇతర హిందూ సంస్థలు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అలప్పుజ జిల్లాలో బంద్‌ పాటిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.వి. గోపకుమార్‌ తెలిపారు. మరోవైపు నిరసన సమయంలో నియంత్రణ పాటించాలని RSS నాయకత్వం తమ కార్యకర్తలను కోరింది.

రాహుల్ కృష్ణ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాసరగోడ్ నుంచి తిరువనంతపురానికి ‘విజయ యాత్ర’కు నాయకత్వం వహిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ ఈ హత్యను తీవ్రంగా ఖండించారు. దీని వెనుక PFI హస్తం ఉందని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై దాడులకు, సీఎం విజయన్ దుష్టపాలనకు అద్దం పడుతుందన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన పినరయి సర్కార్.. దాడులకు తెగబడుతోందని ఆరోపించారు.

నందు కృష్ణ హత్యను ఏపీ బీజేపీ ఇంఛార్స్ సునీల్ దేవధర్ ఖండించారు. ఈ హత్యతో కేరళ తిష్టవేసిన జిహాదీ నరహంతక రూపాలు మరోసారి బహిర్గతమయ్యాయని అన్నారు. ఓ యువ RSS కార్యకర్త హత్య ఇందుకు అద్దం పడుతోందంటూ ట్వీట్ చేశారు.

ఇటీవలికాలంలో కేరళలో RSS కార్యకర్తలు వరుస హత్యలకు గురవుతున్నారు. గతంలోనూ పలువురు RSS కార్యకర్తలను దారుణంగా చంపేశారు. కేరళ ఎక్కడ RSS కార్యకర్త హత్య జరిగినా.. ప్రముఖంగా SDPI పేరే వినపడుతోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కు చెందిన రాజకీయ విభాగమే ఈ SDPI. 2006 PFI ఏర్పడింది. అప్పటి నుండి PFI కార్యకర్తలు పలు ఘర్షణలు, రాజకీయ హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో జరిగిన పలు హత్యల్లో PFI ప్రమేయం వున్నట్టు.. NIA సహా పలు దర్యాప్తు సంస్థలు అనేక సందర్భాల్లో గుర్తించాయి. కేరళలో NIA గుర్తించిన తొలి ఇస్లామిక్ స్టేట్ మాడ్యూల్‎లో.. కొంతమంది PFI సభ్యుల పేర్లు బయపడటం అప్పట్లో కలకలం సృష్టించింది. అంతేకాదు, 2020 ఆగస్టులో జరిగిన బెంగళూరు అల్లర్లలో కూడా PFI అనుబంధ సంస్థ SDPI పేరు వినిపించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

thirteen − eleven =