More

    కేరళలో ఓ క్రికెట్ టీం.. జట్టు సభ్యులంతా ముస్లింలే..!

    అది ఓ క్రికెట్ టీమ్.. జట్టు సభ్యులంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. నాట్ జస్ట్ ప్లేయర్స్.. జట్టు కోచ్, టీమ్ మేనేజర్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు. ఇలా ఒక మతానికి చెందిన వారిని మాత్రమే ఒక టీంగా ఎంచుకోవడం పాకిస్తాన్ వంటి దేశాల్లో కనిపిస్తే పెద్ద ఆశ్యర్యపోవక్కర్లేదు. నేను ఆ వార్త మీకు వినిపించనూ అక్కర్లేదు. కానీ ఇది జరిగింది సాక్షాత్తూ భారత్ లో. మన కేరళలో.. ఎక్కడెక్కడ హిందువుల జన సంఖ్య తగ్గిపోతుందో అక్కడికక్కడ ఈ దేశం ముక్కలైపోతూ ఉంటుంది అని పెద్దలు చెప్పిన మాట ఊరికనే కాదు అనేది ఇటువంటివి తెలుసుకుంటున్నప్పుడు అనిపిస్తుంది.

    కేరళలో సౌత్ జోన్ జూనియర్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ కోసం ముస్లింలు మాత్రమే కలిసి ఒక క్రికెట్ జట్టును ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ టోర్నమెంట్ చెన్నైలో జరుగుతుంది. జట్టు సభ్యులు, జట్టు, టీమ్ మేనేజర్ కూడా ముస్లింలేనని ఒక వార్తాపత్రికలో ప్రచురితమైన కధనం ద్వారా తెలిసింది.

    ఈ విషయాన్ని బిజెపి నాయకుడు సందీప్ వచస్పతి షేర్ చేసి పినరయ్ సర్కార్ ను దుయ్యబట్టారు. ఇది ముస్లిం యూత్ లీగ్ క్రికెట్ జట్టు కాదని, సెక్యులర్ కేరళ రాష్ట్ర అధికారిక జట్టు అని జట్టు ఎంపికను ఎద్దేవా చేశారు. పాపం కేరళలోని హిందువులు, క్రైస్తవులకు క్రికెట్ ఆడటం తెలియకపోవడంతో ముస్లిం సభ్యులను మాత్రమే ఎంచుకోవడానికి జట్టు యాజమాన్యం ఎంచుకుందంటూ అపహాస్యం చేశారు.

    ఇక కేరళ ప్రకటించిన ఆ సభ్యుల పేర్లు ఇలా ఉన్నాయి.

    ఎన్ ముహమ్మద్ యాసిన్ (కెప్టెన్),

    ఎకె ముహమ్మద్ సాజాద్ (వైస్ కెప్టెన్),

    అహ్మద్ ఫినాష్,

    కెపి అద్నాన్

    కోచ్- M.K మునీర్. మేనేజర్: మజీద్ బావా.. ఇలా మిగిలిన వారు కూడా ముస్లింలే ఉన్నారు.

    ఇక సందీప్ వాచస్పతి పెట్టిన పోస్ట్ ను చూసి నెటిజన్లు కేరళ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.

    Trending Stories

    Related Stories