More

    మసాజ్ సెంటర్ లో యువతిని కొట్టిన వీడియోలు చూపించినా పట్టించుకోని పోలీసులు

    కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఆయుర్వేద మసాజ్ సెంటర్ ఉద్యోగి తన సహోద్యోగురాలిని చెప్పుతో కొట్టి, ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న ఎర్నాకుళం పోలీసులు నిందితుడు అజిత్ నారాయణన్‌పై కేసు నమోదు చేశారు. నారాయణన్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మసాజ్ సెంటర్‌లో సర్వీస్ గురించి క్లయింట్ ఫిర్యాదు చేయడంతో తనకు, నారాయణన్‌కు వాగ్వాదం జరిగినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆ తర్వాత నారాయణన్ ఆమెను చెంపదెబ్బ కొట్టి, లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని ఆరోపణలు చేసింది. దీంతో ఆ మహిళ నారాయణన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తనపై దాడికి సంబంధించిన సిసిటివి ఫుటేజీని కూడా సమర్పించింది. అయితే పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదు. మసాజ్ సెంటర్‌లో తాను జనవరి 8 నుండి పని చేయడం ప్రారంభించానని.. అప్పటి నుంచి నిందితుడు తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేసింది. సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా నిందితులపై సరైన చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

    నగరంలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు మైనర్ అబ్బాయిలు లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన చోటు చేసుకున్న కొద్ది రోజుల తర్వాత ఇది చోటు చేసుకుంది. మైనర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా, 10-12 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలిక తన ఇంటి బయట ఆడుతుండగా, అదే ప్రాంతానికి చెందిన నిందితుల్లో ఒకరైన మైనర్ ఆమెను ప్రలోభపెట్టాడు. ఆ తర్వాత తన స్నేహితుడితో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మైనర్ బాలిక సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చి తన తల్లితో జరిగిన దారుణాన్ని వివరించింది. భారతీయ శిక్షాస్మృతి (IPC), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడింది.

    Trending Stories

    Related Stories