ఆ వీడియో ఎప్పుడు రికార్డు చేశారో ఏమో కానీ కేరళలోని మదర్సాకు చెందిన టీచర్ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనించవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇస్లాం మతాన్ని విడిచిపెట్టిన ఎవరైనా కానీ చంపబడాలని ‘సమస్థ కేరళ సున్నీ విద్యా మండలి’ ఉపాధ్యాయుడు షఫీ సాది చెప్పుకొచ్చాడు. కుమారంపుట్టూర్ కు చెందిన ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
12 వ తరగతి విద్యార్థుల ఆన్‌లైన్ సెషన్‌లో పాల్గొన్న షఫీ సాది మాట్లాడుతూ “ఎవరైనా ఇస్లాం/మతాన్ని విడిచిపెడితే అతని విధి ఏమిటి? ఇస్లాం అతనిని పశ్చాత్తాపం చెందమని అడుగుతుంది, అయినప్పటికీ, అతను పశ్చాత్తాపం చెందకపోతే అతన్ని పాలకుడు చంపాలి ” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. “అది హింసనా? లేదు, కానీ ఇస్లాం అనుచరులు మతాన్ని విడిచిపెట్టిన పర్యవసానమేమిటి..? మరణం తరువాత ఎలా ఉండబోతున్నారో గుర్తు చేసుకోవాలి. అతను నరకానికి వెళ్తాడు” అని షఫీ సాది మరింత వివరంగా చెప్పుకొచ్చాడు.
అనేక మంది సోషల్ మీడియా యూజర్లు కేరళ పోలీసులను ట్యాగ్ చేశారు. షఫీ సాది విద్వేషాలను రెచ్చగొడుతూ ఉన్నారని.. అరెస్టు చేయాలని కోరారు.

భారతీయ ఇస్లామిక్ పండితుడు ముఫ్తీ మౌలానా షేక్ అబూబ్యాకర్ నేతృత్వంలోని కేరళలో అత్యంత ప్రభావవంతమైన సంస్థలలో ‘సమస్థ కేరళ సున్నీ విద్యాభ్యాస బోర్డు’ ఒకటి. ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ను ఈ సంస్థ అందిస్తూ ఉంది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సుమారు పదివేల మదర్సాలు సమస్థ కేరళ సున్నీ బోర్డుతో అనుబంధంగా ఉన్నాయి. మదర్సా పిల్లలకు సాధారణ విద్య బోధించే ముందు రెండు గంటల పాటు మత పరమైన విద్యను బోధిస్తారు.
కేరళలో తీవ్రవాదం పట్ల ఆకర్షితులైన వారు:
కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదులు “గణనీయమైన సంఖ్యలో” ఉన్నారని ఉగ్రవాదంపై జూలై 2020లో యుఎన్ నాటి కథనాల్లో హెచ్చరించింది. ఐసిస్ గురించి నిఘా వేస్తున్న బృందం ఇచ్చిన 26 వ నివేదిక ప్రకారం “2019 మే 10 న ప్రకటించిన ఐసిఎల్ ఇండియన్ అనుబంధ సంస్థ (హింద్ విలాయా)లో 180 నుండి 200 మంది సభ్యులు ఉన్నారని” తెలిపింది. మే 2019 లో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్, ఐసిల్) టెర్రర్ గ్రూప్ భారతదేశంలో కొత్త “ప్రావిన్స్” ను స్థాపించినట్లు హెచ్చరించింది. కేరళకు చెందిన పలువురు తీవ్రవాదం పట్ల ఆకర్షితులు అయ్యారు. చాలా మంది ఐసిస్ లో చేరిన ఉదంతాలు కూడా బయటకు వచ్చాయి.
మదర్సాలకు నిధులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేరళ హైకోర్టు:
ఈ నెల ప్రారంభంలో కేరళ హైకోర్టు పినరయి విజయన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో మదర్సాలు నడపడానికి అపారమైన ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై నిలదీసింది. మతపరమైన కార్యకలాపాలకు ఎందుకు నిధులు సమకూరుస్తున్నారో చెప్పాలని అడిగారు. కేరళ మదర్సా టీచర్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్, 2019 ను రద్దు చేయాలని కోరుతూ సిటిజన్ ఆర్గనైజేషన్ ఫర్ డెమోక్రసీ, ఈక్వాలిటీ, ట్రాంక్విలిటీ, సెక్యులరిజం కార్యదర్శి మనోజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కేరళ హైకోర్టు విన్నది.
పిటిషనర్ తరపు న్యాయవాది సి రాజేంద్రన్ మాట్లాడుతూ, కేరళలోని ఈ మదర్సాలు ఖురాన్ మరియు ఇస్లాంకు సంబంధించిన ఇతర పాఠ్యపుస్తకాల గురించి మాత్రమే జ్ఞానాన్ని ఇస్తున్నాయని అన్నారు. ఈ చట్టం ప్రకారం కేరళలోని మదర్సాలు చెప్పిన ప్రయోజనాల కోసం భారీ మొత్తంలో డబ్బును పొందుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగంలో పొందుపరచబడిన లౌకికవాద సూత్రాలకు వ్యతిరేకమని పిటిషనర్ వాదించారు. “కేరళలో మదర్సాలు పూర్తిగా మతపరమైన కార్యకలాపాలలో పాల్గొంటాయి. మతపరమైన కార్యకలాపాల కోసం రాష్ట్రం నిధులు సమకూర్చడం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?” అంటూ కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.