హిందూ పండుగ పై ఇస్లామిస్టుల ద్వేషం – కేరళ తమిళులపై దాడులు

0
791

హిందువులు హిందూ పండగ చేసుకోవడం సైతం పరాయి మతస్థులకు గిట్టడం లేదు. పండగ చేసుకుంటున్నవారిపై దాడులు చేసి దారుణాలకు పాల్పడుతున్నారు. కేరళకు చెందిన తమిళులు దీపావళి పండువ చేసుకుంటుంటే…హఠాత్తుగా ఇస్లామిస్టు మూకలు అక్కడికి వచ్చి అసహనం ప్రదర్శించారు. ఇష్టానుసారం ప్రవర్తించారు. మహిళలు, పిల్లలనైనా చూడకుండా తమిళ కుటుంబీకులపై దాడులకు తెగబడ్డారు.

ఎర్నాకులం జిల్లా మువట్టుపుజాలో తమిళ కుటుంబీకులు కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్నారు. తినుబండారాలు తయారు చేసి విక్రయాలు దీపావళి నాడు ఇంట్లో మిఠాయిలు తయారు చేసుకుని, వీధిలో బాణసంచా కాలుస్తున్నారు. ఎంతో సరదాగా సాగుతున్న దీపావళి వేడుకలకు ఇస్లాం ముష్కర మూకలు సైంధవుల్లా అడ్డుతగిలారు. తమిళ కుటుంబీకులకు పొరుగునే వున్న పోలీసు అధికారి నేతృత్వంలో ముష్కర ముఠా తమిళ కుటుంబపై దాడికి దిగింది.

బాధితులు గత కొన్ని దశాబ్దాలుగా మువట్టుపుజా మార్కెట్‌ ఏరియాలో నివాసం వుంటున్నారు. తినుబండారాలు తయారు చేసి విక్రయించడం వీరి వృత్తి. తమిళ చిరు వ్యాపారులు దీపావళి వేడుకల్లో భాగంగా కొందరు ఇంటి లోపల మిఠాయిలు, తినుబండారాలు తయారు చేస్తున్నారు. మరికొందరు బాణసంచా కాల్పుల్లో నిమగ్నమయ్యారు. సరిగ్గా ఈ సమయంలో..తమిళ సంఘం సభ్యుల ఇళ్లలోకి ఇస్లాం ముష్కరులు చొరబడి..చిరుతిండ్లు వండుతున్న స్టవ్‌లను ధ్వంసం చేశారు. మరోవైపు దీపావళి పటాసులు కాలుస్తున్న తమిళ సోదరులపైనా దాడికి తెగబడ్డారు. బాణసంచా కాల్చకుండా అడ్డుకుని దుర్భాషలాడారు. తంకపాండ్యన్, ఆయన భార్య, ఆయన తల్లిదండ్రులు పి.టి. పాండ్యన్, మీనా, భాస్కరన్‌లపై దారుణంగా దాడి చేశారు. పదేళ్ల లోపు ఇద్దరు చిన్నారులను నేలపైకి ఈడ్చి అమానుషంగా ప్రవర్తించారు. పదునైన ఆయుధంతో దాడి చేయడంతో భాస్కరన్ కంటికింద గాయమైంది. ఈ కుటుంబీకులకు చెందిన ఒక మహిళ మెడలో బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. మహిళలు సహా క్షతగాత్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ చర్యపై తమిళయిన్ కలెక్టివ్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముజాట్టుపుజా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ అమానుషకాండను తమిళనాడు సీఎంకు తెలియజేసి, తమకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోమని కోరింది. ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ అధికారి రఫీక్, మరో ముగ్గురు కలిసి ఈ దారుణకాండకు తెరలేపారని పేర్కొంది.

సందట్లో సడేమియాలాగా కొందరు రాజకీయ నేతలు సీన్ లోకి ఎంటరై..సామరస్యపూర్వకంగా ఇరు వర్గాలు వ్యవహరించాలని లెక్చర్లు దంచేశారు. ఓ వైపు పండగపూట అకారణంగా దాడులకు గురై..ఆసుపత్రి పాలై అన్ని అవస్థలు పడుతుంటే..నిందితులపై సానుభూతి ప్రవర్తించే రీతిలో కొందరు రాజకీయ నేతలు ప్రవర్తించి, ప్రజాగ్రహానికి గురయ్యారు. ఇంతలో…సీనియర్ పోలీసు అధికారులు ఘటనా స్థలికి రావడంతో…మధ్యస్థులని పేరు చెప్పుకున్న రాజకీయ నేతలు చల్లగా జారుకున్నారు.

ఈ ఘటనను స్థానికులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. హిందు సంప్రదాయాలు, విశ్వాసాలను దెబ్బతీయాలని ఇస్లాం వర్గీయులు, కొందరు పోలీసుశాఖ అధికారులతో చేయికలిపి ఈ అమానుషకాండ సాగించారని అన్నారు. అధికార సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్.. ఈ రెండింటి నుంచి ఇస్లాం మత ఛాందసవాదులకు అన్ని రకాల ఆశీర్వాదాలు వున్నందు వల్లే…ఈ తరహా దుర్ఘటనలు జరుగుతున్నాయని హిందూ బంధువులు అంటున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

13 − 9 =