శరీరాన్ని ముక్కలు చేసి.. వండుకు తిని..? కేరళలో మహ్మద్ షఫీ దారుణాలు..!

0
769

కేరళ క్షుద్ర హత్యల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ హత్యల వెనుక ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మహ్మద్ షఫీ.. ఇద్దరు మహిళలను చంపి మర్మాంగాలను వండుకుని తిన్నట్టు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అంతేకాదు క్షుద్ర పూజల పేరుతో ఒక కుటుంబంలోని భార్యా భర్తలతో కూడా ఈ పనే చేయించినట్టు తెలుస్తోంది. ఈ దారుణ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘాతుకాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. ఆధునిక కాలంలో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయా..? అని ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ కేరళలో ఏంజరిగిందో తెలుసుకుందాం.

భగవల్ సింగ్, లైలా అనే దంపతులు పథనంతిట్ట జిల్లాలో ఎలాన్‎థోర్ గ్రామంలో నివాసముంటున్నారు. కొన్నేళ్లుగా వీరి కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడుతోంది. ఇదే అదనుగా భావించిన మహ్మద్ షఫీ.. అనే క్షుద్ర మాంత్రికుడు 2019 నుంచే ఈ కుటుంబంపై కన్నేశాడు. ఫేస్‎బుక్‎లో శ్రీదేవి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి భగవల్ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ తర్వాత తన పేరు కేవలం సింగ్ గా చెప్పుకుంటూ కుటుంబంతో ప్రత్యక్షంగా సంబంధాలు కొనసాగించాడు. ఈ నేపథ్యంలో భగవల్ కుటుంబం కూడా మహ్మద్ షఫీ ను పూర్తిగా నమ్మింది. కుటుంబాన్ని పూర్తిగా మచ్చిక చేసుకున్న తర్వాత మహ్మద్ షఫీలోని రాక్షసుడు బయటికొచ్చాడు. తన కోరికలను తీర్చుకోవడానికి.. అప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న భగవల్ సింగ్ దంపతులకు ఎరవేశాడు. క్షుద్రపూజల చేస్తే మీ కుటుంబం సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మబలికాడు. దీనికోసం మనుషులను బలివ్వాలని మహ్మద్ షఫీ కోరాడు. దాదాపు మూడు సంవత్సరాలకు పైనే ఆ కుటుంబంతో సత్సంబంధాలు నెరపడంతో ఆ దంపతులు కూడా ఒప్పుకున్నారు.

ఇక, కార్యచరణలోకి దిగిన మహ్మద్ షఫీ.. గత జూన్ లో రోస్లీ అనే 49 ఏళ్ళ మహిళను ఎలాన్‎థోర్ గ్రామానికి తీసుకొచ్చాడు. భగవల్ దంపతుల ఇంట్లో ఉంచిన మహ్మద్ షఫీ ఆమెను దారుణంగా హింసించాడు. ఆమెను ఇంట్లో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మర్మాంగాల్లో కత్తితో పొడుస్తూ రాక్షసానందం పొందాడు. తర్వాత భగవల్ దంపతుల సహాయంతో గొంతు కోసి చంపేశాడు. అంతటితో ఆగని ఆ నరరూప రాక్షసుడు.. రోస్లీ శరీరాన్ని 56 ముక్కలుగా నరికినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. అలాగే, పద్మన్ అనే 52 ఏళ్ల మహిళను కూడా గత సెప్టెంబర్‎లో ఇదే విధంగా చిత్ర హింసలు చేసి అత్యాచారం చేసి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. పద్మన్ శరీరాన్ని 5 ముక్కలుగా నరికి సంచిలో కుక్కి పాతిపెట్టాడు. ఇదంతా క్షుద్ర పూజల్లో భాగమేనని భగవల్ సింగ్ దంపతులను నమ్మించి వారిదగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడు మహ్మద్ షఫీ.

అయితే, ఈ విషయాన్ని పోలీసులు గుర్తించలేదు. మృతుల మిస్సింగ్ కేసుల దర్యాప్తులో భాగంగా.. తీగ లాగితే డొంక కదిలింది. నరరూప రాక్షసుడు మహ్మద్ షఫీ రాక్షసత్వం బయటపడింది. దీంతో ఈ ఒళ్లు గగుర్పొడిచే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు ప్రధాన కారకుడైన మహ్మద్ షఫీపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితులను హత్య చేసిన తర్వాత వారి శరీరాల నుండి మర్మాంగాలను వేరు చేసి వాటిని వండుకుని తిన్నట్లు విచారణలో వెల్లడికావడం ఆందోళన కలిగిస్తోంది. ఇలా తింటే వారి కుటుంబంలో సమస్యలు దూరమవుతాయని మహ్మద్ షఫీ చెప్పినట్లు దంపతులు విచారణలో వెల్లడించారు. దీంతో మహ్మద్ షఫీ నేర చరిత్రను పోలీసులు పరిశీలించారు. ఇందులో షఫీ ఒక సైకో అని గుర్తించారు. అంతేకాదు, అతడిపై గతంలో ఒక అత్యాచార నేరం కూడా నమోదైంది. 2020లో 75 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం జరిపి షఫీ అరెస్టయ్యాడు. ఆ కేసులో కూడా ఇప్పటిలాగే వృద్దురాలిని తీవ్రంగా హింసించినట్లు తేలింది. 15 ఏళ్ల కాలంలో షఫీపై 10 క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది.

అయితే ఇటువంటి వ్యక్తులపై పోలీసులు ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పదికి పైగా క్రిమినల్ నేరాలకు పాల్పడినా.. ఇప్పటికీ బయట దర్జాగా ఎలా తిరుగుతున్నాడంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × 3 =