More

  సీతమ్మను అవమానించిన కేరళ పీసీసీ ప్రెసిడెంట్.. భగ్గుమన్న హిందూ సమాజం..

  రాముడంటే కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం. ఎంతో భక్తి శ్రద్దలతో ప్రతిరోజూ ఆ శ్రీరాముడిని కొలుస్తారు. అటువంటి రాముడిని హిందువుల ఓట్లతో గెలుపొందిన కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా తులనాడుతున్నారు. సభ్యసమాజం ఛీత్కరించేలా అసహ్యపదజాలంతో రాముడిని దూషిస్తున్నారు. తాజాగా కేరళ పీసీసీ అధ్యక్షుడు కె. సుధాకరన్ కూడా ఇటువంటి వ్యాఖ్యలనే చేశాడు. రామలక్ష్మణుల సంబంధ బాంధవ్యాలను తీవ్రపదజాలంతో దూషించాడు. ఓ జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్యూలో కె సుధాకరన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆ ఇంటర్యూలో ఉత్తర, దక్షిణ కేరళ నాయకులకు మధ్య తేడాలను వివరించే క్రమంలో రామలక్ష్మణుల మధ్య సంబంధాలతో పోల్చి చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు చరిత్రలో లేని వ్యాఖ్యలను చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు కేరళ పీసీసీ ప్రెసిడెంట్.

  ఆ ఇంటర్యూలో కె సుధాకరన్ మాట్లాడుతూ,.. రాముడు యుద్దంలో రావణుడిని ఓడించిన తర్వాత సీతా, లక్ష్మణ సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరారట. మార్గం మధ్యలో దక్షిణ కేరళ వద్ద సముద్రం రాగానే రాముడిని సముద్రంలోకి తోసేసి.. సీతను అయోధ్యకు తీసుకెళ్ళాలని అనుకుంటాడట లక్ష్మణుడు. ఆ తర్వాత ఉత్తర కేరళకు చేరుకోగానే లక్ష్మణుడు అది తప్పని భావిస్తాడట. ఇక చివరికి రాముడు లక్ష్మణుడి తొడపై పడుకుని నీ అంతరంగం నేను గ్రహించాను. అది నీ తప్పు కాదు, నువ్వు ఉన్న ప్రాంతానికున్న ప్రభావం వల్ల అటువంటి ఆలోచన వచ్చిందని రాముడంటాడట. ఈ విధంగా లక్ష్మణుడు తల్లితో సమానంగా భావించే సీతమ్మ తల్లిని మోహించినట్లుగా కె సుధారకన్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా తీవ్ర దుమారం రేకెత్తించింది. సుధారకన్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలు కేరళీయులను కించపరిచేవిగా ఉన్నాయని కేరళ బీజేపీ అధ్యక్షులు కె సురేంద్రన్ విమర్శించారు. అతడు పీసీసీ పదవికి ఏమాత్రం అర్హుడు కాదని కె సురేంద్రన్ అన్నారు. కేరళీయులను, హిందువులను కించపరిచిన వ్యక్తిని తక్షణమే పీసీసీ పదవినుంచి తొలగించాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.

  అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టారు. కొంతమంది లక్ష్మనుడి వ్యక్తిత్వాన్ని గుర్తు చేశారు. గతంలో హనుమంతుడికి సీతమ్మ ఆభరణాలు దొరికినప్పుడు.. వాటిలో లక్ష్మణుడు సీతమ్మ పాదాలకున్న పట్టీలను గుర్తుపడతాడు. అదెలా అని రాముడు ప్రశ్నించగా,.. సీతమ్మను తానెప్పుడూ నేరుగా చూడలేదనీ, ఎప్పుడూ పాదాలవైపే ఎక్కువగా చూస్తాననీ అందుకే పట్టీలను మాత్రమే గుర్తుపట్టగలిగానని లక్ష్మణుడు జవాబిస్తాడు. ఇంతటి గౌరవభావంతో సీతమ్మను లక్ష్మణుడు ఆరాధిస్తాడు. అయితే ఇలాంటి పుణ్యపురుషులను అసభ్యంగా తులనాడటం కాంగ్రెస్ పార్టీ నాయకులకే చెందిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే హిందూ వ్యతిరేకత ఉందని దుయ్యబడుతున్నారు. గతంలో కూడా రాముడే లేడని ఏకంగా సుప్రీం కోర్టులోనే అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ కాంగ్రెస్ అని అటువంటి పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదని అంటున్నారు.

  ఇక కాంగ్రెస్ పార్టీ లో కే సుధాకరన్ లాంటి నాయకులు చాలామందే ఉన్నారు. రాహుల్ గాంధీ తాజాగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో కూడా ఆయన సమక్షంలోనే ఓ పాస్టర్ హిందూ దేవతలను తులనాడాడు. ఇక మరో వ్యక్తి గతంలో నడిరోడ్డుపై గోవును చంపి పచ్చి మాంసం తిన్న వ్యక్తి కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక అధికారంలో ఉన్న రాజస్తాన్ లో హిందువులను పండుగపూట దేవాలయానికే రాకుండా ఆంక్షలు విధించారు. ఈ విధంగా సమయం వచ్చినప్పుడల్లా హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ కేవలం ఎన్నికలప్పుడు గుళ్ళు గోపురాలకు తిరిగితే ఏమాత్రం లాభముంటుందో ఆ పార్టీ అధ్యక్షుడికే తెలియాలి.

  Trending Stories

  Related Stories