National

ఆలయం ముందు ఫ్లెక్సీ.. అందులో ముఖ్యమంత్రే దేవుడంటూ..!

కేరళలోని మలప్పురంలోని వాలంచేరి మహా విష్ణు ఆలయం ముందు ఉంచిన ఫ్లెక్స్ బోర్డుపై వివాదం నెలకొంది. తమిళనాడు సిఎం పినరయి విజయన్‌ను ‘కేరళ దేవుడు’ అని అభివర్ణిస్తూ అందులో ఉంది. సరిగ్గా ఆలయానికి ముందే ఇలాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై ప్రజల్లో కోపం, వ్యతిరేకతతో పాటూ విమర్శలు కూడా తీవ్రమయ్యాయి. ఈ హోర్డింగ్ చాలా పెద్దది, ముఖ్యమంత్రి యొక్క భారీ చిత్రపటంతో ఉంది. సరిగ్గా విష్ణు ఆలయానికి ఉన్న పేరు పైన బోర్డు ఉంచబడింది. “దేవుడు ఎవరు అని మీరు అడిగారు. ప్రజలకు ఆహారం అందించే వ్యక్తి అని అన్నారు. ” అంటూ ఆయనే దేవుడు అనే అర్థం వచ్చేలా ఆ ఫ్లెక్సీలో రాసి ఉంచారు.

ఇది ఒక్కటే కాదు ఎన్నో ఆలయాల దగ్గర కమ్యూనిస్టు పార్టీ నేతల హోర్డింగ్ లు వెలిశాయి. ఆలయం చుట్టుపక్కల ఉంచిన చాలా పోస్టర్ లలో ఇలాంటివే ఉన్నాయి. రెండవ ఫ్లెక్స్ బోర్డు రాష్ట్రంలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ‘దేవుడు’ గా అభివర్ణించింది. దేవతలు కమ్యూనిస్టులని చెబుతూ ఉన్న పోస్టర్లు చాలానే అక్కడ ఉన్నాయి. ఎన్నికలలో కూడా ఇది రుజువు అయిందని చెబుతూ వస్తున్నారు. చాలా ఆలయాల ప్రాంగణాలను కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎరుపు రంగు పోస్టర్లతో నింపివేశారు. ఎన్నికల సమయంలో చాలా ప్రాంతాల్లో ఇదే చోటు చేసుకుంది.

ఈ పోస్టర్లు పెద్ద వివాదాన్ని రేకెత్తించాయి. మహా విష్ణు ఆలయ అధికారులు మాట్లాడుతూ మేలో రెండవసారి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఫ్లెక్సీని కొందరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. స్థానిక సిపిఎం నాయకులు ఇది తమ పని కాదని చెప్పుకొచ్చారు. ఈ సంఘటనలో తమ పాత్ర లేదని వారు ఖండించారు. పచిరి విష్ణు ఆలయ కమిటీ అధ్యక్షుడు రవీంద్రన్ మాట్లాడుతూ ఇలాంటి ఫ్లెక్స్ బోర్డులను ఏర్పాటు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రెండో బోర్డు చాలా తప్పుడు భావనను ప్రజల్లోకి తీసుకుని వెళ్తాయని ఆయన అన్నారు.

ఎన్నికల ఫలితాలను పేర్కొన్న రెండవ బోర్డుకు వ్యతిరేకంగా కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. బోర్డును తగలబెట్టాలని కొందరు డిమాండ్ చేశారు. ఇది శాంతిభద్రతల సమస్యలకు దారితీస్తుందని ఆలయ అధికారులు చెప్పడంతో వాలంచేరి పోలీసులు రెండవ బోర్డును తొలగించారు. అయితే ముఖ్యమంత్రి దేవుడు అనే అర్థం వచ్చే బోర్డు మాత్రం గత వారం వరకు అక్కడే ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అక్కడి నుండి 20 మీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి మార్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

19 + nine =

Back to top button