National

దీపావళి రోజున టపాసులు కాల్చడం నిషేధం

దీపావళి రోజున టపాసులు కాల్చడంపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి నిషేధాన్ని విధించింది. ఢిల్లీ ప్రభుత్వం వరుసగా మూడవ సంవత్సరం కూడా టాపాసులు కాల్చడంపై నిషేధం విధించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అందుకు సంబంధించి ట్వీట్‌ లు చేశారు. ‘‘గత మూడేళ్ళలో దీపావళి సందర్భంగా ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయి దృష్ట్యా, గత ఏడాది మాదిరిగానే, అన్ని రకాల బాణసంచా నిల్వ, అమ్మకాలు, వాడకంపై సంపూర్ణ నిషేధం విధిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం ఈ చర్యలు తీసుకున్నాం’’ అని తెలిపారు. గతేడాది ఆల‌స్యంగా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌డం కార‌ణంగా.. బాణాసంచాను అప్ప‌టికే కొనుగోలు చేసి నిల్వ ఉంచుకున్న‌ వ్యాపారులకు నష్టం వాటిల్లిందని కేజ్రీవాల్ తన ట్వీట్‌లో తెలిపారు. గ‌త అనుభ‌వం దృష్ట్యా వ్యాపారులెవ‌రూ ఈ ఏడాది బాణాసంచాను నిల్వ చేయవద్దని కోరారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం గత ఏడాది కూడా దీపావళి బాణసంచాపై సంపూర్ణ నిషేధం విధించింది. ప్రమాదకర గాలి కాలుష్యానికి, కోవిడ్-19 వ్యాప్తికి సంబంధం ఉందని కారణాలను చెబుతూ వెళుతోంది ప్రభుత్వం. గత ఏడాది బాణసంచాపై నిషేధం విధించడం ఆలస్యమైనందువల్ల కొందరు వ్యాపారులకు నష్టం జరిగిందన్నారు. ఈ ఏడాది కూడా సంపూర్ణ నిషేధం విధించినందువల్ల బాణసంచాను నిల్వ చేయవద్దని, అమ్మవద్దని కోరారు. దీపావళి సందర్భంగా గత మూడేళ్లుగా ఏర్ప‌డుతున్న‌ ప్రమాదకరమైన కాలుష్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని, ఈ సారి కూడా బాణాసంచాపై నిషేధం విధిస్తున్నామ‌ని తెలిపారు.

ఢిల్లీలో బాణసంచాపై నిషేధం

హిందూ పండుగ దీపావళి సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం పటాకులపై నిషేధం విధించడం ఇది వరుసగా మూడోసారి. ఆప్ ప్రభుత్వం చెప్పే వాదన ఏమిటంటే టపాసుల కారణంగా ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరుగుతుంది. ఇది ఇక్కడి నివాసితులకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఢిల్లీ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలలో ముఖ్యంగా పంజాబ్‌లో దహనాల గురించి మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పంటలను తగులబెట్టడం వంటివి జరిగినా కూడా ఎటువంటి చర్యలను తీసుకోలేదు ఢిల్లీ ప్రభుత్వం. అలా పంటలను తగులబెట్టడమే దేశ రాజధానిలో కాలుష్యానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నా కేజ్రీవాల్ మౌనంగానే ఉన్నారు.

బాణాసంచాపై ఐఐటి అధ్యయనాన్ని నిరాకరించిన సుప్రీంకోర్టు

జూలై 2021 లో, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఒక IIT అధ్యయనాన్ని నిరాకరించింది. కాలుష్యానికి టపాసులు ప్రధాన కారణం కాదని, టపాసుల నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఎఎమ్ ఖన్విల్కర్ మరియు సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ఐఐటి అధ్యయనానికి అంగీకరించడానికి నిరాకరించింది. టపాసులు కాలుష్యానికి కారణమవుతాయని తెలుసుకోవడానికి ఐఐటి అవసరం లేదని పేర్కొంది. జస్టిస్ ఖన్విల్కర్ ఈ అధ్యయనంపై నిప్పులు చెరిగారు, “పటాకులు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అర్థం చేసుకోవడానికి మీకు ఐఐటి అవసరమా? దీపావళి సమయంలో ఏమి జరుగుతుందో ఢిల్లీలో ఉంటున్న వారిని అడగండి” అని అన్నారు. గాలి నాణ్యత (ఎక్యూఐ) మెరుగుపడితే పటాకుల అమ్మకం మరియు వినియోగాన్ని అధికారులు అనుమతించవచ్చని బెంచ్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

Related Articles

One Comment

  1. యజ్ఞం కాలుష్యాన్ని ఎలా నివారిస్తుందో… పరిశోధనా వివరాలతో venkata chaganti గారు ( YOUTUBE CHANNEL ) delhi govt. కి పంపారు.. ట. దానికి స్పందన లేదు కానీ,,,,,

Leave a Reply

Your email address will not be published.

13 + ten =

Back to top button