చార్ అణా కోడికి బారణా మసాలా ఏందీ బై! ఇది తెలంగాణలో ఎక్కువగా జనం వాడే సామెత! ఇక్కడ ఈ సామెతను ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందో ఇప్పుడు చెబుతాను. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం.. ఢిల్లీ మొత్తానికి ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తామని ప్రకటించింది. అయితే ఆ వ్యాక్సినేషన్ కు ఎన్నికోట్ల రూపాయలు కేటాయించింది? దాంతోపాటే పబ్లిసిటీ కోసం.. ఎంత మొత్తంలో కేటాయించిందో తెలుసా?
ఢిల్లీవాసులకు ఉచితంగా కోవిడ్ టీకాలు వేయడానికి రూ.50 కోట్లు కేటాయించినా కేజ్రీవాల్ ప్రభుత్వం.., పబ్లిసిటీ కోసం మాత్రం కేటాయించిన సొమ్ము అక్షరాల 150 కోట్లు! ఇది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వర్కింగ్ స్టయిల్..!
మన దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ లో ఎక్కువగా కేసులు నమోదైన రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. ఐసోలేషన్ పడకల నుంచి మొదలు పెడితే ఐసీయూ బెడ్స్ వరకు, అలాగే…రెమిడెసివిర్ మందుల నుంచి మొదలు పెడితే ఆక్సిజన్ వరకు కొరత ఏర్పడింది. ప్రజల అవసరాల విషయంలో ఎప్పుడు ముందు చూపుతో.., ముందుండే ఢిల్లీ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ కరోనా మహహ్మరిని ఎదుర్కొనేందుకు చేసింది శున్యమని… ఆర్టీఐ రిపోర్టు ద్వారా తెలుస్తోంది.దీంతో కోవిడ్ ను కట్టడి చేయడంలో కేజ్రీవాల్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
అంతేకాదు ప్రస్తుతం దేశంలో కరోనా టీకాలపై రెండు కంపెనీల గుత్తాధిపత్యాన్ని తొలగించాలని, అలాగే ఇతర మందుల కంపెనీలకు సైతం ఆ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసేందుకు విధానపరమైన అనుమతి ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు.
అయితే ఇదంతా బాగానే ఉంది…కానీ! రెండు కోట్ల జనం ఉన్న ఢిల్లీకి నాలుగు కోట్ల డోసుల వ్యాక్సిన్ అవసరం. ఒక్క మోతాదుకు రూ.250 ఖర్చు లెక్క వేసుకున్నా… మొత్తం జనాభాకు ఉచితంగా టీకాలు వేయాలంటే కేజ్రీవాల్ ప్రభుత్వానికి కనీసం రూ.1000 కోట్ల రూపాయలు అవసరం.! అయితే.. కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత వ్యాక్సినేషన్ కేవలం రూ.50 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. ఇదే సమయంలో తన ప్రభుత్వ గొప్పలు చెప్పుకునేందుకు, మీడియా పబ్లిసిటీ ప్రకటనల మార్కెటింగ్ కోసం మాత్రం కేజ్రీవాల్ ప్రభుత్వం ఏకంగా రూ. 150 కోట్ల పైగా కేటాయించడమే కాదు ఖర్చు కూడా చేసేసింది. అది కూడా ఈ కేటాయింపులన్ని కూడా జస్ట్ మూడు నెలల కోసం మాత్రమేనని మానం మర్చిపోరాదు. కేజ్రీవాల్ ప్రభుత్వం జనవరి 2021 నుంచి మార్చి 2021 వరకు మీడియా ప్రకటనల కోసం చేసిన ఖర్చులపై అలోక్ భట్ అనే ఆర్టీఐ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇంకా ఆన్ లైన్ మీడియాలో ప్రకటనల కోసం కేజ్రీవాల్ సర్కార్.., జనవరి నెలలో 22.52 కోట్లు, ఫిబ్రవరి నెలలో 25.33 కోట్లు, అలాగే మార్చి నెలలో 92.38 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. మొత్తంగా ఈ 90 రోజులకు లెక్కేస్తే సగటునా రోజుకు 1.67 కోట్ల రూపాయలను కేవలం పబ్లిసిటీ కోసం ఖర్చు చేసింది కేజ్రీవాల్ సర్కార్. అది కూడా కరోనా కల్లోలం తాండవిస్తూన్న వేళా..! ఇప్పుడు తెలిసిందా…! కేజ్రీవాల్ సర్కార్ ను నేషనల్ మీడియా నుంచి మొదలు పెడితే మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు అహో ఓహో అంటూ ఎందుకు మోస్తున్నాయో..! అలాగే కేజ్రీవాల్ వైఫల్యాలను కప్పిపుచ్చి.. వాటిని ప్రధాని మోదీకి ఎందుకు అంటగడుతున్నాయో…!