More

    ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబం పాత్ర.. ఒబేరాయ్ హోటల్ లో డీల్: ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ

    ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ కుటుంబానికి కూడా లింకులు ఉన్నాయని.. ఢిల్లీ మద్యం పాలసీ డిసైడ్ చేసింది తెలంగాణ ముఖ్యమంత్రి అనుచరులేనని ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు 150 కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పంజాబ్, బెంగాల్ లో తీసుకొచ్చిన మద్యం పాలసీ వెనుక కూడా ఈ శక్తుల హస్తం ఉందని ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ నుండి స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి ఢిల్లీ లో ఒబెరాయ్ హోటల్ లో మంతనాలు జరిపారని.. ఒబెరాయ్ హోటల్ లోనే ఎక్సైజ్ పాలసీని రూపొందించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయంటున్నారు. మొదటి ఇన్ స్టాల్ మెంట్ కింద 150 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన వారే ఈ రూ. 150 కోట్లు ఇచ్చారన్నారు. ఆరు నెలల పాటు ఒబెరాయ్ హోటల్ బుక్ చేసుకున్నారని చెప్పారు. మనీష్ సిసోడియాతో పాటు అతని అనుచరులు, తెలంగాణ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఈ హోటల్ లోనే ఉండి తతంగం నడిపించారని బీజేపీ ఎంపీ పర్వేజ్ సింగ్ వర్మ ఆరోపించారు.

    spot_img

    Trending Stories

    Related Stories