More

    సార్.. ఏం చెప్తారు..

    టీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం రేపు జరగనుంది. రేపు మధ్యాహ్నం 2గంటలకు టీఆర్ఎస్ ముఖ్యనేలందరితో సమావేశం కావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీంతో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పొలిటికల్‎గా ఏదో జరగనుందని, సీఎం కేసీఆర్ ఏం చెబుతారోనని పార్టీ శ్రేణులు ఆతృతగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం, మునుగోడు ఫలితం టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా రావడం, జాతీయ పార్టీగా బీఆర్‌ఎస్‌కు దాదాపుగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ముఖ్య నేతలందరితో భేటీ హాట్ టాఫిక్‎గా మారింది. సమావేశంలో కేసీఆర్ ఏయే అంశాలపై చర్చిస్తారు..? కేసీఆర్ మరోసారి ముందస్తుకు వెళ్లే ఉద్దేశంతోనే భేటీ జరగనుందా..? అందులో భాగంగానే శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారా..? అన్న చర్చ జోరుగా సాగుతోంది.

    Trending Stories

    Related Stories